గుడి బాట పట్టిన  ప్రొఫెసర్ కోదండరాం..!

ధర్మపురి , బుగ్గారం ఆలయాలు సందర్శన!


మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని..

J. SURENDER KUMAR,

మహాశివరాత్రి సందర్భంగ శనివారం తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొ.కోదండరాం  జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామంలోని సంతాన యుక్త  శ్రీ సాంబశివ నాగేశ్వరాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం 24గంటల మహా శివసంకల్ప గాన స్వరాభిషేకం నిర్వహిస్తున్న నక్కరాజు ను సన్నానించి, సన్మాన పత్రం అందజేశారు.  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు అర్చకులు వేద పండితులు ఘనంగా ఆశీర్వదించి స్వామి వారి ప్రసాదం శేష వస్త్రాన్ని  బహుకరించారు.


ధర్మపురిలో తాగునీటి, తెలుగు కళాశాల తదితర సమస్యలపై విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

జగిత్యాల లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడారు.
గడ్డం జలపతి రెడ్డి కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా అందించాలి
జర్నలిస్టుల కు, ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు అందజేయాలి


సంక్షేమ పథకాలు జర్నలిస్టుల కు అందించాలి
అధికార పార్టీ నాయకునికి భూములు కట్టబెట్టేందుకే ప్రయత్నాలు


కరంట్ కోతలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వం గుంటూరు ఆరోపించారు.
తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు, కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ కంతి మోహన్ రెడ్డి, నాయకులు శంకర్, కంతి రమేష్, పసునూరి శ్రీనివాస్, తరుణ్, అక్షయ్ , జహంగీర్, తదితరులు పాల్గొన్నారు.