గల్ఫ్ మృతుల కుటుంబాలకు ₹ 5లక్షలు స్థానిక ఎమ్మెల్యే లే ఇప్పించాలి !

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి!

J. Surender Kumar,

గల్ఫ్ కార్మిక కుటుంబాలకు రు.5లక్షల ఆర్థిక సాయం అందించాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలదే అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిహారం అందించకపోతే గల్ఫ్ కార్మికుల కుటుంబాలతో కలిసి రాజకీయాలకు అతీతంగా ప్రత్యక్ష పోరాటానికి దిగాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హెచ్చరించారు.
కథలాపూర్ మండలం గంభీర్ పూర్ లో ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి అక్కడే మృతి చెందిన వెంకటేష్ కుటుంబాన్ని గురువారం పట్టబద్రుల ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, వేములవాడ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆది శ్రీనివాస్ లు పరామర్శించారు.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో  మాట్లాడారు ఆయన మాటల్లో…
తెలంగాణ రాష్ట్రం వస్తే తమ బతుకులు మారుతాయని, రాజకీయాలకు అతీతంగా ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే..స్థానికంగా ఉపాధి కరువై గల్ఫ్ వలసలు గతంలో కన్నా రెట్టింపు అయ్యాయి.
తెలంగాణలో గ్రామీణ నిరుపేద యువత ఉపాధి కరవై సుమారు 15 లక్షల మంది గల్ఫ్ లో ఉపాది పొందుతున్నారు.
స్థానికంగా ఉపాధి కరువై  పుట్టిన  ఊరిని, కుటుంబాన్ని వదిలి గల్ఫ్ బాటా పడుతున్నారు.
మానసికంగా కుంగిపోతు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గల్ఫ్ కార్మికులను ఆదుకోవలసిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు.
ఉమ్మడి రాష్ట్రంలో గల్ఫ్ లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు రు.1లక్ష ఆర్థిక సాయం అందజేశామని గుర్తు చేశారు.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గల్ఫ్ లో మృతి చెందిన కుటుంబాలను ఆదుకునేందుకు రు.5లక్షలు ఇస్తామని ప్రకటించారని అన్నారు.
ఉత్తర తెలంగాణ నుండి  15లక్షల మంది గల్ఫ్ లో ఉపాధి పొందుతున్నారు.
ప్రతి నెలా కనీసం రు.10 వేల చొప్పున 1500 కోట్లు గల్ఫ్ కార్మికుల నుండి వస్తోంది.
ఏటా రు.18000 కోట్లు విదేశీ మారకద్రవ్యం సమకూరుస్తున్నారు.
8 ఏళ్లలో 1,44,000కోట్ల విదేశీ మరక ద్రవ్యం సమకుర్చుతు కేంద్ర ప్రభుత్వానికి ఆసరాగా నిలుస్తున్నారు.
గల్ఫ్ కార్మికుల సంపాదన నుండి తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం 10% అమ్మకం పన్ను రూపంలో  ఏటా రు.1800కోట్లు రాగ, 8ఏళ్ల లో రాష్ట్రానికి 14,400 కోట్ల ఆదాయం సమకూరింది.
8ఏళ్లలో మానసికంగా, పని ఒత్తిళ్లతో 2000 మంది గల్ఫ్ లో కార్మికులు మృతి చెందారని జీవన్ రెడ్డి అన్నారు.
గల్ఫ్ కార్మికుల కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం ఆదుకునేందుకు కనీసం చొరవ చూపలేదని, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ద్వజమెత్తారు.
విదేశీ మారక ద్రవ్యం రూపం లో కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమాకుర్చుతు గల్ఫ్ కార్మికులే ప్రభుత్వాలను ఆదుకుంటున్నారు.
గల్ఫ్ కార్మికుల పేరిట భూమి, ధరణి పాస్ బుక్ ఉన్నా, స్థానికంగా లే రైతు బంధు నిరాకరించడం సరి కాదన్నారు.
గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం చర్యలు చేపట్టాలని ప్రతి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ గా సభలో చర్చకు లేవనెత్తిన ప్రభుత్వం గల్ఫ్ కార్మికులను  ఆదుకునెందుకు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానికంగా ఉపాధి లభిస్తే కుటుంబాలను వదిలి గల్ఫ్ వెళ్తారా..ఉపాధి కోసం గల్ఫ్ వెల్లడం తప్పా అని నిలదీశారు.
గల్ఫ్ కార్మికులు చనిపోతే వారి మృతదేహాన్ని తీసుకు రావడంతోపాటు బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్న గల్ఫ్ జేఏసీ పై కేసు పెట్టడాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
వేములవాడ ఎమ్మెల్యే ఇంటి ఎదుట శవపేటిక తోనిరసన వ్యక్తం చేస్తే కేసులు పెడతారా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఎవరు మాట్లాడవద్దా ?  అని ప్రశ్నించారు.గల్ఫ్ జేఏసీ నాయకులు పై పెట్టిన కేసును ఉప సంహరింపజేయడం ఎమ్మెల్యేదే బాధ్యత అన్నారు.
రాష్ట్రంలోని ఏ నియోజక వర్గంలో గల్ఫ్ కార్మికులు మృతి చెందిన స్థానిక ఎమ్మెల్యే బాధ్యత వహించాలని అన్నారు.
గల్ఫ్ లో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
పంజాబ్ లో చనిపోయిన రైతులకు ఆర్థిక సాయం చేస్తున్న సీఎం కెసిఆర్ గల్ఫ్ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత లేదా అని నిలదీశారు.
ఇల్లు లేని గల్ఫ్ కార్మికుడు కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలి.
గురుకుల పాఠశాలల్లో గల్ఫ్ కార్మికుల పిల్ల లకు 5శాతం సీట్లు కేటాయించాలి.
తెలంగాణ లోని గల్ఫ్ బాధిత కుటుంబాలకు  ఒక్కో కుటుంబానికి 5లక్షల చొప్పున 2000 కుటుంబాలకు రు.100 కోట్లు కేటాయించాలి అని డిమాండ్ చేశారు.