హరిత జగిత్యాల లక్ష్యముగా !
జగిత్యాల పురపాలక సంఘం,23-24 బడ్జెట్ సమావేశము !

J. SURENDER KUMAR,

మౌళిక సదుపాయాల కల్పన, స్వచ్చ మరియు హరిత జగిత్యాల లక్ష్యముగా
మరియు పట్టణభివృద్ది ద్యేయముగా 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ను రూపొందించినట్లు మున్సిపల్ ఇంచార్జ్ చేర్ పర్సన్ గోలి శ్రీనివాస్ తెలిపారు.
శనివారం మున్సిపల్ సమావేశ మందిరములో ఇంచార్జ్ చేర్ పర్సన్ గోలి శ్రీనివాస్ అధ్యక్షతన మునిసిపల్ కౌన్సిల్ ప్రత్యేక బడ్జెట్ సమావేశము జరిగింది. ఇట్టి సమావేశములో ఎం.ఎల్.ఏ. డా. యం. సంజయ్ కుమార్ మరియు జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాష, పాల్గొన్నారు.
సమావేశము లో పురపాలక సంఘం జగిత్యాల బడ్జెట్ 2023-24 ఆర్థిక సంవత్సరమునకు గాను రూ.లు 60.17 కోట్ల బడ్జెట్ ను కౌన్సిల్ ఆమోదించారు.

పట్టణమును హరిత జగిత్యాల లక్ష్యముగా గ్రీన్ బడ్జెట్ కు బడ్జెట్ యందు 10% నిధులు రూ.లు 2.54 కోట్లు కేటాయించడం జరిగినది. ప్రస్తుత పట్టణ ప్రజారోగ్య రిత్య పారిశుధ్య నిర్వహణకు రూ.లు 2.82 కోట్లు కేటాయించడం జరిగినది. ప్రజల మౌఖిక సదుపాయాల కల్పనే లక్ష్యముగా అభివృద్ధి పనుల నిమిత్తం, వీలిన గ్రామాల అభివృద్ధి, వెనుకబడిన తరగతుల, మైనరిటిల మరియు మురికి వాడల ప్రాముఖ్యం కలిగిన వార్డుల అభివృద్ధి, పార్కులు, ఆటస్థలాలు, పబ్లిక్ టాయిలెట్స్, ఓపెన్ జిమ్ లు, స్ట్రీట్ వేండర్ జోన్స్ ఆధునిక జంతు వదశాలల నిర్మాణం, శాస్త్రీయమైన పద్దతిలోడంపింగ్ యార్డులు మరియ ఘణ-ద్రవ వ్యర్ధాల నిర్వాహణ , మరియు మొదలగు వాటికి రూపాయలు 4.85 కోట్లు నిధులు కేటాయించారు. ఈ సంధర్భముగా జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాష మాట్లాడుతూ… ప్రజల మౌఖిక సదుపాయాల కల్పనలో భాగముగా పట్టణములో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయుటకు ఆదేశించినారు.

జగిత్యాల మునిసిపాలిటి ఆస్థి పన్ను వసూలులో వెనుకబడి ఉన్నందున కౌన్సిలర్లు మరియు ప్రజల భాగస్వామ్యముతో 100% ఆస్తి పన్ను వసూలు చేసి జగిత్యాల పట్టణమును అభివృద్ధి చేసే విదముగా ఆక్షన్ ప్లాన్ తయారు చేయుటకు ఆదేశించరు. కుక్కల బెడదను నివారించడానికి ప్రభుత్వము మార్గదర్శకాలు విడుదల చేయడము జరిగినది. దాని ప్రకారము తగు చర్యలు తీసుకొనుటకు ప్రత్యేకముగా ఆక్షన్ ప్లాన్ తయారు చేయడము జరిగినది. జగిత్యాల పట్టణములో నిరు పేదలకు 2BHK నిమిత్తము ఆన్లైన్ యందు దరఖాస్తు చేసిన వారిలో 3355 మంది అర్హులుగా గుర్తించడము జరిగినది. మార్చి మాసములో పట్టణములోని ఆని వార్డుల యందు వార్డు సభలు నిర్వహించి అందులో అర్హులు మరియు అనర్హుల జాబితాను ప్రకటించడము జరుగుతుందని తెలియచేశరు.
ఎం.ఎల్.ఏ. డా.యం.సంజయ్ కుమార్ మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థలకు ప్రత్యేకముగా పట్టణ ప్రగతి కార్యక్రమము ద్వారా మున్సీపాలిటిల అభివృద్దికి నిధులు మంజూరు చేస్తున్నారని వీటి ద్వారా పట్టణ అభివృద్దికి మరియు పారిశుద్యమునకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడము జరిగినదని తెలిపినారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆసరా పెన్షన్ ద్వారా జగిత్యాల పట్టణములోని అర్హులైన 17259 మంది లబ్దిదారులకు సంవత్సరానికి రూ.43.35 కోట్లు వారి బ్యాంక్ ఖాతా యందు జమచేయడము జరుగుతుందని తెలియచేసారు. తెలంగాణ రాష్త్రములో ఎక్కడా లేని విదముగా జగిత్యాల పట్టణము లోని నూకపెల్లి యందు 4520 2BHK మంజూరు చేయడము జరిగినది. నిరుపేదలకు 2BHK మంజూరి నిమిత్తము ఆన్లైన్ యందు దరఖాస్తు కోరగా అందులో 3355 మంది అర్హులుగా గుర్తించడము జరిగినది. మార్చి మాసములో పట్టణములోని ఆని వార్డుల యందు వార్డు సభలు నిర్వహించి అందులో అర్హులు మరియు అనర్హుల జాబితాను ప్రకటించడము జరుగుతుందని తెలియచేసినారు. అనర్హులుగా ప్రకటించిన వారిలో ఎవరైనా అర్హులుగా ఉన్నట్లయితే అట్టి దరఖాస్తులని పున:పరిశీలించడము జరుగుతున్నదని తెలియచేసారు.
సమావేశములో ఇంచార్జ్ చైర్ పర్సన్ గోలి శ్రీనివాస్ , కౌన్సిల్ సభ్యులు, కో-ఆప్షన్ సభ్యులు, కమిషనర్ బి.నరేష్ , డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె.రాజేశ్వర్ మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.