హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ప్రారంభం !

జగిత్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ నాయకత్వంలో..

ధర్మపురి ఆలయం నుండి …

J. SURENDER KUMAR,

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిలుపు ధర్మపురి నియోజకవర్గ కేంద్రం లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ముందు నుండి హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ను. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ నాయకత్వంలో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…
కేంద్రంలో మోడీ ప్రభుత్వం మతద్వేషాలు రెచ్చకొట్టి ప్రజల మధ్య చిచ్చు పెడుతూ అనాలోచిత నిర్ణయల వల్ల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న కేంద్ర ప్రభుత్వన్నీ గద్దె దించడానికి రాహులు గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేపట్టినట్టు కార్యకర్తలకు వివరించారు.

ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని చలి, వాన, ఎండను సైతం లెక్క చేయకుండా నాలుగు వేల కిలోమీటర్ల భారత్ జోడో యాత్ర చేశారన్నారు.
అట్టి విజయ లక్ష్యాలను కొనసాగింపుగా రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యలను, ప్రజల ముందు పెట్టేందుకు రేవంత్ రెడ్డి నాయకత్వంలో హాత్ సే హాత్ జోడో యాత్రను అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టడం జరిగిందన్నారు.


కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ధర్మపురి లో యాగాలు, హోమాలు, పూజలు నిర్వహించి, ధర్మపురి పుణ్యక్షేత్రకి ₹500కోట్ల రూపాయలు ఇస్తా అని ప్రకటించారన్నారు.
కానీ పెద్ద ఎత్తున యాదాద్రిని అభివృద్ధి చేసుకున్నాడు తప్ప ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి నిధులు కేటాయించలేదని అని కేసీఆర్ ను ప్రశ్నించారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్ 2009 నుండి ఇప్పటి వరకు ఎమ్మెల్యే గా, విప్ గా, ఇప్పుడు మంత్రి గా ఉన్నారు. అయినా ఇప్పుటి వరకు ధర్మపురిని ఒక రెవెన్యూ డివిజన్ చెయ్యలేదు, ఒ ఐటీఐ కళాశాల లేదు, పాలిటెక్నిక్ కళాశాల లేదు, అగ్రికల్చర్ కళాశాల లేదు. విమర్శల వర్షం కురిపించారు.
బలమైన నాయకత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయిన బలహీన పర్చలన్ని, నిరంతరం కొప్పుల ఈశ్వర్ ప్రయత్నం చేస్తున్నాడు. అతను ధర్మపురి కి మంత్రి గా వ్యహరిస్తున్నాడా ? ,లేదా రాష్ట్రానికి మంత్రి గా వ్యవరిస్తున్నాడా.? అంటూ లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు.
కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి, చెమటోడ్చి నన్ను గెలిపిస్తే కలెక్టర్ శరత్, కొప్పుల ఈశ్వర్ నన్ను ఓడగొట్టి గద్దెనెక్కి కూర్చున్నాడు అంటూ ఆరోపణలు చేశారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, దళిత బందు ఇస్తా అన్నాడు,, కానీ ఇచ్చేవి ఆసరా పెన్షన్, రైతు బంధు మాత్రమే అన్నారు.


ధర్మపురి గోదావరి తలపున ఉన్న ఇక్కడి ప్రాంతానికి నీళ్లు అందవు. ఇక్కడి నీళ్లు అన్ని లిఫ్ట్ ద్వారా మంత్రి హరీష్ రావు హైదరాబాద్ కు, సిద్దిపేట కు తీసుకెల్లుతున్న ఇక్కడ మంత్రి ఈశ్వర్ గారి స్పందించరు ఆరోపించారు.
లిఫ్ట్ కింద ఎంతో మంది రైతుల భూములను, రెవెన్యూ వాళ్ళని, పోలీస్ వాళ్ళని పెట్టి, రైతులను భయబ్రాంతులకు గురిచేసి బలవంతంగ భూములను లాక్కోవడం దారుణ వంతు లక్ష్మణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోళ్ల వాగు అంచనా వ్యయాన్ని పెంచారు, అయినప్పటికీ రోళ్ల వాగు ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు
కేంద్ర ప్రభుత్వం రైల్వేలను, విమాన సర్వీసులను ప్రయివేటు పరం చేస్తుంది, నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచిందని విమర్శించారు.
ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీసులు తీసుకొని ఈ హాత్ సే హాత్ జోడో యాత్రను ప్రారంభించడం జరిగింది.
ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వల వైఫల్యను ప్రతి గడప గడప కి తీసుకెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ ఈ హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ను చెప్పట్లా జరిగిందంటూ లక్షణ్ కుమార్ వివరించారు.