ఇసుక అక్రమ రవాణా జరగకుండా పట్టిష్టమైన చర్యలు తీసుకోవాలి !

జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష

J. Surender Kumar,

జగిత్యాల జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా పట్టిష్టమైన చర్యలు తీసుకోవాలనీ జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ అధ్యతన గురువారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు
.

జిల్లాలో ఆమోదిత ఇసుక రీచులు ఉన్నాయి.. ఇప్పటి వరకూ ఈ రీచులలో ఎంత క్వాలిటీ ఇసుక తీశారు… మిగతా బ్యాలెన్స్ ఎంత ఉంది అన్న దానిపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు వివరాలను అడిగితెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ

జిల్లాలో కొత్త ఇసుక రీచెస్ ఎన్ని ఎక్కడెక్కడ ఉన్నాయో క్షేత్రస్థాయిలో అధికారుల బృందం ఐడెంటిఫై చేసి నివేదిక సమర్పించాలన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ సమావేశంలో ఇసుక టాక్స్ మీద ఓరియంటేషన్ ఇచ్చారు.
ఇసుక టాక్స్ ల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. ఈ నిధులతో గ్రామపంచాయతీల అభివృద్ధికి ఊతం అందించినట్లు అవుతుందన్నారు. జిల్లాకు సోర్స్ ఆఫ్ రెవెన్యూ జనరేట్ అవుతుందన్నారు.
సమావేశంలో గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, విజయ్ కుమార్. కోరుట్ల, మెట్ పల్లి ఆర్డీవోలు . వినోద్ కుమార్ మాధురి తాసిల్దార్లు రీచ్ లో ఉన్న సర్పంచులు తదితరులు పాల్గొన్నారు
.