₹ 47,1500/- పరిహారం చెల్లింపులు!
చట్టాలపై ప్రజలకు అవగాహన కోసం కృషి చేద్దాం !
జిల్లా సెషన్స్ జడ్జి జి నీలిమ !
J. Surender Kumar,
జగిత్యాల న్యాయస్థానంలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో 1617 కేసులలో రాజీ కుదిరాయి. పరిహారం డబ్బులు ₹ 47,15000/- చెల్లింపుల జరిగాయి. జిల్లా స్పెషన్ జడ్జ్ జి నీలిమ పర్యవేక్షణలో రెవెన్యూ, పోలీస్, బార్ కౌన్సిల్ సభ్యులు తమ తమ క్లైంట్లతో రాజీలు చేయించారు. ఇందులో 23 సివిల్ కేసులు, 1594 క్రిమినల్ కేసులు 9 MVOP కేసులు ఉన్నాయి. ఈ సందర్భంగా అధికార యంత్రాంగంతో చాంబర్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా, ఎస్పీ భాస్కర్ ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటి సమన్వయ సమావేశం శనివారం జిల్లా సెషన్స్ జడ్జి జి జిల్ల నీలిమ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ,.రెవిన్యూ, పోలీస్ కు సంబంధించిన పెండింగ్ కేసులను, రాజిమార్గంలో తీసుకు రావడానికి సహకరించాలని కోరారు., ప్రజల్లో చట్టాలపై అవగాహన తీసుకురావడానికి అందరూ కలిసి కట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ఎస్పీలతో పాటు ఆర్డఓ మాధురి, డీఎస్పీ ప్రకాష్ లు సమావేశం పాల్గొన్నారు.
