జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాక బంధీ ! విస్తృత తనిఖీలు!

డాక్యుమెంట్స్, నెంబర్ ప్లేట్స్ సరిగా లేని 167 వాహనాలను సీజ్ !

J.Surender Kumar,

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు నాకా బంధీ నిర్వహించారు. నాకా బంధీ లో ప్రతి ఒక్క వాహనాలను తనిఖీ చేయడ జిల్లా లోకి వచ్చే అన్ని దారులు లలో పోలీస్ అధికారులు , సిబ్బంది వివిధ టీంలు గా ఏర్పడి ఏక కాలంలో ముమ్మర తనిఖీ లు చేసారు. సుమారు 1000 వాహనాలు తనిఖీ చేయగా ఇందులో సరైన డాక్యుమెంట్స్ మరియు నెంబర్ ప్లేట్స్ సరిగా లేని 167 వాహనాలను సీజ్ చేశారు.

కొందరు అనుమానితులని విచారించి వారి ఆధార్ కార్డు తనిఖీ చేయడం జరిగింది. నెంబర్ ప్లేట్స్ సరిగా లేని వాహనాలను, నెంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించి వాటికి సరైన నెంబర్ ప్లేట్లను బిగించిన తర్వాత వాహనాలను వదిలిపెట్టారు.


ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… అసాంఘిక శక్తులను ,అనుమానిత వ్యక్తులను కట్టడి చేసేందుకు , నేరాల అదుపుకు జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని జిల్లాలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఇలాంటి ముందస్తు తనిఖీలు నిర్వహిస్తూ ప్రజల్లో భద్రత భావాన్ని కల్పించడమే జిల్లా పోలీసులు లక్షమని తెలిపారు. జిల్లా లో ఎవరైనా అనుమానస్పదంగా తిరుగుతూ వుంటే వెంటనే పోలీసుల కు ఫోన్ చేయాలని లేదా డయల్ 100 కాల్ కు ఫోన్ చేసినాచో వెంటనే చర్యలు చేపడతాం అన్నారు. తనిఖీలు నిర్వహించడం వలన నేరాల రేటు తగ్గుముఖం ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని తెలిపినారు.
నిబందనలకు విరుద్దంగా , ఇష్టారీతిన వాహన నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేయడం కొందరు వాహనదారులు ట్రాఫిక్ ఈ చలాన్ నుంచి తప్పించుకోవడం కోసం వాహనాలపై ఫ్యాన్సీ నంబర్ తో పాటు తప్పుడు నంబర్ లు సైతం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆయా నంబర్ ప్లేట్లపై వివిధ ఆకారాలు, డిజైన్లు, పదాలు, అక్ష రాలు గుర్తించలేనంతగా ఉంటున్నాయి. కొందరు కావాలనే వాటిని తొలగించడం, నంబర్ గుర్తించకుండా నెంబర్ ప్లేట్ విరగ్గొట్టడం చేస్తున్నారు.

ఇలాంటి వారు వాహన తనిఖీల్లో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కావున జిల్లా పరిదిలోని ప్రజలు అందరు పోలీస్ వారికీ సహకరించి తమ వాహనాల నెంబర్ ప్లేట్స్ నిబందనల ప్రకారం బిగించు కోవాలని, లేని పక్షం లో వాహనాలపై నంబర్ లేకుండా, నిబందనలకు విరుద్దంగా నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేసి వాహనం నడిపితే వాహనదారుడిపై ఛీటింగ్ కేసులను నమోదు చేయబడుతాయని ఎస్పి వాహనదారులకు సూచించారు .ఈ మధ్యకాలంలో నెంబర్ ప్లేట్ లేని వాహనాలను ఉపయోగించి చైన్ స్నాచింగ్, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న దృష్ట్యా ఈ యొక్క తనిఖీలు నిరంతర నిర్వహించడం జరుగుతుందని కావున జిల్లా పరిదిలోని ప్రజలు అందరు పోలీస్ వారికీ సహకరించలని కోరారు.
ఈ కార్యక్రమంలో సి. ఐ లు కిషోర్, ఆరిఫ్ అలీ ఖాన్ , రమణమూర్తి, లక్ష్మీనారాయణ, ప్రవీణ్ కుమార్ , మరియు ఎస్ఐ లు ASI లు, హెడ్ కానిస్టేబుల్,కానిస్టేబుల్, హోంగార్డులు పాల్గొన్నారు
.