జర్నలిస్టుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం విడనాడాలి!

15 మండలాల్లో జర్నలిస్టుల ధర్నాలు,


జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ !


జె. సురేందర్ కుమార్,

ప్రజలు ప్రభుత్వానికి వారధిగా ప్రముఖ సామాజిక సేవ స్పృహతో జర్నలిస్టులు తమ వృత్తిపరంగా చేస్తున్న సేవలు అమోఘం. చాలీచాలని వేతనాలతో పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలతో ఆర్థికంగా అనేక ఇబ్బందులతో జర్నలిస్టుల జీవితాలు గడుపుతున్నాయి. జర్నలిస్టుల చిరకాల కోరిక ఇండ్ల స్థలాలు ఇప్పటివరకు ఆ కోరిక నెరవేరకపోవడం చాలా బాధాకరమైన విషయం. జర్నలిస్టులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం టియుడబ్ల్యూజే – (ఐజేయు) కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా శాఖ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నడుం బిగించింది.

జనవరి 23న ఆసిఫాబాద్ జిల్లా కేంద్ర టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా కార్యవర్గ సమావేశంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా పోరాటాలు సిద్ధమయ్యాయి. ఫిబ్రవరి 13వ తేదీన నిర్దేశిత మండల అధికారుల కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించి వినతి , ఫిబ్రవరి 22 న నవంబరు డివిజన్ అధికారి వద్ద రిలే దీక్షలు, వినతి మార్చి 6 తేదీ నాడు జిల్లా కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా ప్రదర్శనలు నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి దశ సోమవారం నిర్వహించిన తహసిల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు వినతి కార్యక్రమం నిర్వహించడం 15 మండలాల్లో విజయవంతమైంది.
ఈ కార్యక్రమంలో ఐజేయు కౌన్సిల్ సభ్యుడు ఎస్ వేణుగోపాల్, జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యుడు ప్రకాష్ గౌడ్, టీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణంరాజు, టీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా విభాగం అధ్యక్షుడు బిక్కజి, ఎలక్ట్రానిక్ మీడియా విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, టీయూడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శిలు దేవునూరి రమేష్, అబ్దుల్ హన్నాల కార్యదర్శి, కార్యనిర్వహణాధికారి నిరుపేదలు టీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యులు వారణాసి శ్రీనివాస్ , సయ్యద్ సోజర్ , జర్నలిస్టులు మేకల శ్రీనివాస్ , దాసరి సురేష్ , జానకిరామ్ , రాధాకృష్ణ చారి , రాజు , కుమార్ , నరేష్ ఉన్నారు.