కళాశాల భవన నిర్మాణం కోసం.. .₹17 కోట్లు విడుదల!

J. Surender Kumar,

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అబ్ గ్రేడ్ చేస్తూ రెసిడెన్షియల్ స్కూల్ భవనం (బాలుర) మరియు జూనియర్‌ కాలేజీ (Junior College) భవన నిర్మాణం కోసం ప్రభుత్వం ₹ 17 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఫిబ్రవరి 4న జీవో నెంబర్ 1 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ధర్మపురి నియోజకవర్గం గొల్లపల్లి మండలం లో 7 ఎకరాల్లో 17 కోట్ల తో 735 సర్వే నంబర్ లో నూతన భవన నిర్మాణం చేపట్టనున్నారు.


జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ను సొంత భవనం లేకపోవడంతో ఈ పాఠశాల ను ధర్మపురి మండలం మగ్గిడి కి మార్చడం జరిగింది.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ లో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్‌ కాలేజీ (బాలికల) ను విస్తరణ పనుల కోసం ₹1 కోటి రూపాయలతో పురాతన భవనాలు తొలగిస్తూ, నూతనంగా ప్రయోగశాల, హెల్త్ క్లినిక్, డైనింగ్ భవనాలు, మరియు టాయిలెట్స్ నిర్మాణానికి నిధులు మంజూరు జీవో జారీ అయ్యింది,