కళ్యాణ లక్ష్మీ,షాది ముబారక్ పథకం దేశానికి ఆదర్శం !

మంత్రి కొప్పుల ఈశ్వర్ !

J.SURENDER KUMAR,

మంగళవారం జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలానికి మంజూరు 49 లబ్ధిదారులకు 49,05,684 లక్షల రూపాయల  కళ్యాణ లక్ష్మీ చెక్కులను, మరియు మండలానికి నూతనంగా మంజూరు అయిన 65 మంది కి పెన్షన్ ప్రొసీడింగ్స్ లను అందించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
వివిధ కారణాల వల్ల అనారోగ్యం పాలైన టువంటి వాళ్ళు సొంత ఖర్చులతో వైద్యం చేయించుకొని ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్లై చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన 52 లబ్ధిదారులకు 16,28,0000 విలువ గల చెక్కుల పంపిణీ చేయడం జరిగింది.


ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….
👉కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ పథకం అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలో పుట్టింది.
నిరు పేద ఆడపడుచులకు పెద్దన్నయ్య ల అండగా ఉంటున్నారు.
👉టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది అని అన్నారు.కళ్యాణ లక్ష్మి పథకంతో పెదింటి ఆడబిడ్డల పెండ్లికి రూ.1,00116 వేలు ఆర్దిక సహాయం అందిస్తుందని అన్నారు.
👉మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది. అని అన్నారు రాష్ట్రంలోని మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
దేశంలోని 29 రాష్ట్రాలలో 130 కోట్ల జనాభా లో 2016 రూపాయల పెన్షన్ ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్  మాత్రమేన్నారు..


వృద్ధులు, వితంతులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు, నేత, గీత, డయాలసిస్, బోధకాలు బాధితులకు అండగా ఆసరా పథకాలు అందిస్తూ గొప్ప మానవతా వాదిగా,మనసున్న నేతగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.
కొత్తగా పెన్షన్ రావాలంటే మరొకరి చావు కోసం కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి
కాంగ్రెస్ ప్రభుత్వం 75 రూపాయల పెన్షన్ ఇస్తే.. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ రెండు వేలు, మూడు వేల పెన్షన్ ఇస్తున్నారు.
అందరికి ఆసరా అందిస్తూ ఇంటి పెద్ద కొడుకుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిలుస్తున్నారని అన్నారు, అన్నం పెట్టిన సీఎం కెసిఆర్ ను మరువద్దని మంత్రి అన్నారు