కంటి వెలుగు కార్యక్రమంలో నేటి వరకు 5,62,266మందికి ఐ స్క్రీనింగ్ !

J. Surender Kumar,

 కంటి వెలుగు కార్యక్రమంలో నేటి వరకు   5,62,266  మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. కంటి వెలుగు కార్యక్రమం లో బాగంగా ఇప్పటి వరకు 1,79,380 మందికి రీడింగ్ అద్దాలను ఉచితంగా పంపిణీ చేశారు. 86,412 మందికి ప్రిస్కిప్షన్ అద్దాలను పంపిణీ చేశారు. 2,96,380మందికి ఎటువంటి కంటి జబ్బులు లేవని గుర్తించారు.

గురువారం నాడు 18,486మందికి ఐ స్క్రీనింగ్ చేయగా 4,332 మందికి రీడింగ్ అద్దాలను పంపిణీ చేశారు. 2,221మందికి ప్రిస్కిప్షన్ అద్దాలను త్వరలో అందజేయనున్నారు. 11,932మందికి ఎటువంటి కంటి జబ్బులు లేవని గుర్తించారు.


BRS పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, కౌన్సిలర్ పదవికి రాజీనామా. చేసిన భోగ శ్రావణి!

కొద్ది రోజుల క్రిందటే జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసిన బోగ శ్రావణి BRS పార్టీ లోనే కొనసాగుతుందని భావించారు, గురువారం ఆమె పార్టీ సభ్యత్వానికి, తద్వారా పార్టీ ద్వారా సంక్రమించిన కౌన్సిలర్ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖను BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవ్వనున్నట్లు ఆమె తన నివాసంలో ప్రకటించారు.


లయన్స్ క్లబ్, మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరం


పోచమ్మ వాడ మున్నూరు కాపు యువజన సంఘం మరియు లయన్స్ క్లబ్ జగిత్యాల జిల్లా సహకారంతో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరం స్థానిక పోచమ్మ దేవాలయం వద్ద గురువారం నిర్వహించారు.,
ఈ శిబిరంలో సుమారు 150 మంది కంటి పరీక్షలు చేయించుకోగా నలభై మంది శస్త్ర చికిత్స నిమిత్తం రేకుర్తి లయన్స్ క్లబ్ హాస్పిటల్ కు పంపించారు.,
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా అధ్యక్షులు తాటిపాముల సురేష్, కోశాధికారి గుండేటి గంగాధర్, లయన్స్ క్లబ్ సభ్యులు మున్నూరు కాపు సంఘ నాయకులు వొడ్నాల రాజశేఖర్, లయన్స్ క్లబ్ సభ్యులు తాటిపాముల వినోద్ మ్యనపురి శ్రీనివాస్, శ్రీరాముల సుదర్శన్ చిలుక రాజన్న వి శంకర్, కన్నవేణి మల్లారెడ్డి, దోపాటి దేవదాస్, పోచమ్మ వాడ మున్నూరు కాపు సంఘ నాయకులు జంగిలి రవికుమార్, కొక్కు రవి మాసం చిన్న రమేష్ పిట్ట రాజన్న కొక్కు రాములు రమేష్ పుప్పాల రెడ్డి ఉడ్నాల మహేష్ కొక్కు లక్ష్మణ్ కొక్కు గంగాధర్ జంగిలి రాజమౌళి జంగిలి ధర్మేందర్ జంగిలి ఓంకార్ మరియు తదితరులు పాల్గొన్నారు