ఆదాయ ఖర్చులు తీరుపై సీఎం కెసిఆర్ సీరియస్
దొంగతనం సంఘటన తో చర్యలకు బ్రేక్ !
అవినీతి అక్రమాలపై వరుస కథనాలు ! ప్రచురించిన ‘ ఉప్పు ‘ ఎఫెక్ట్ !
J. SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో కొందరు కీలక ఉద్యోగులపై బదిలీ వేటు చర్యలకు రంగం సిద్ధమైంది. ఆలయ పాలనా, ఆదాయ ఖర్చులు తీరు తేన్నులతో పాటు అవినీతి ఆరోపణల ఉదంతాలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయినట్టు సమాచారం. ఈ మేరకు ముగ్గురు ఉద్యోగుల బదిలీకి కమిషనర్ శ్రీకారం చుట్టారు. దీనికి తోడు ఆలయంలో జరుగుతున్న అక్రమాలు, అవినీతి, ఆడిట్ అధికారులు అభ్యంతరం చేసిన కోట్లాది రూపాయల సొమ్ము రికవరీలో నిర్లక్ష్యం, తదితర అంశాల పై ‘ఉప్పు’ వరుస కథనాలు ప్రచురించింది.

వివరాల్లోకి వెళ్తే.
కొండగట్టు క్షేత్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ₹100 కోట్ల నిధులు కేటాయించడంతోపాటు, స్వయాన ఈ నెల 15న కొండగట్టు క్షేత్రంలో పర్యటించి చేపట్టాల్సిన అభివృద్ధి పనులు తదితర అంశాలపై ప్రభుత్వ యంత్రాంగంతో కొండగట్టు క్షేత్రంలోనే సమీక్షించారు.

ఈ నేపథ్యంలో ఆదాయం ఖర్చుల వివరాలను సమీక్షించారు. . దేవాదాయ శాఖ కమిషనర్ లేక సంఖ్య B1/4170/2021, 17/2/2023 న డిప్యూటీ కమిషనర్ హోదా గల వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, కొమురవెల్లి ,బాసర, సికింద్రాబాద్ గణేష్ ఆలయాల, కార్యనిర్వహణాధికారుల కు జారీ చేసిన ఉత్తర్వులలో కొండగట్టు ఆలయంలో విధులు నిర్వహిస్తున్న కొందరు ఉద్యోగులు. బదిలీ చేయబడ్డారు. వారి హోదా స్థాయి గల వారి సర్వీస్ వివరాలను పంపించాల్సిందిగా ఉత్తరంలో పేర్కొన్నారు.

క్రమశిక్షణ చర్యల లో భాగంగా కొండగట్టు ఆలయ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్ లు ఉన్నారు . . ఈనెల24న కొండగట్టు ఆలయంలో భారీ చోరీ జరగడంతో ఉద్యోగుల పై చర్యలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టు సమాచారం.