కొండగట్టు ఆలయ అభివృద్ధికి ₹ 100 కోట్లు కేటాయింపు!

పరిపాలన అనుమతులతో నిధులు విడుదల!


ప్రత్యేక జీవో జారీ.

J. Surender Kumar,

జగిత్యాల జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ₹100 కోట్ల నిధులు కేటాయించింది. పరిపాలన అనుమతులతో నిధులు విడుదల చేసింది. ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య.49, ఈ నెల 7న ప్రత్యేక అభివృద్ధి నిధులు నుంచి కొండగట్టు క్షేత్ర అభివృద్ధి కోసం ప్రత్యేక జీవో ద్వారా ₹100 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వ కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

సీఎం కేసిఆర్ హామీ మేరకు..
గత సంవత్సరంలో డిసెంబర్ 7న జగిత్యాల్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కలెక్టరేట్ భవనం సముదాయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం కేసీఆర్. పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సీఎం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి కోసం వంద కోట్ల నిధులు కేటాయిస్తానంటూ సభాముఖంగా ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం నిధులు కేటాయించింది
.ఆంజనేయస్వామి సన్నిధికి ఏటా లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారన్నారు. ఆలయాన్ని అద్భుతంగా నిర్మించేదుకు రూ.100కోట్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

త్వరలోనే వచ్చి ఆగమశాస్త్రం ప్రకారం.. భారతదేశంలోనే సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రంగా నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఇచ్చిన మాట ప్రభుత్వం ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్ పర్యవేక్షణలో ప్రాధాన్యత గలఅభివృద్ధి పనులను గుర్తించి చేపట్టాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు