కొండగట్టు దొంగతన విచారణలో..వెలుగు చూస్తున్న పాలన డోల్లతనం !

అర్చకులకు మెమో ఎందుకు ఇవ్వవు ?


ఈ వో తీరును ప్రశ్నిస్తూ ఫిర్యాదు ?

J. SURENDER KUMAR,

కొండగట్టు దొంగతనం తీరు తేన్నులపై అంతర్గతంగా విచారణ లో ఆలయ అధికారుల పాలన డొల్లతనం వెలుగు చూస్తున్నట్టు సమాచారం.
శుక్రవారం తెల్లవారుజామున అంతరాయం లో జరిగిన స్వామివారి ఆభరణాలు వెండి వస్తువులు చోరీకి సంబంధించిన వారం రోజుల సీసీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్న అధికారులకు భక్తులు కొందరు అర్చకులకు డబ్బులు ఇవ్వడం, వారు తమలపాకు లో సింధూరం భక్తులకు ఇవ్వడం ఇలాంటి దృశ్యాలు గంటలో 40 నిమిషాల పాటు. అధికారులకు అగుపించినట్టు సమాచారం.

ఇది ఇలా ఉండగా, దొంగతనం ఒకరోజు ముందు గురువారం ఆలయ ఇన్స్పెక్టర్ విధులకు హాజరు కాకపోవడంతో మరో ఉద్యోగికి ఆలయ పర్యవేక్షణ బాధ్యతలను కార్యనిర్వహణాధికారి మౌఖికంగా ఆదేశించినట్టు సమాచారం. దొంగతన నేపథ్యంతో ఆ ఉద్యోగికి మెమో ఇవ్వగా దాన్ని తిరస్కరిస్తూ, మీరు మౌఖికంగా ఆదేశించారు. నేను విధులు నిర్వహించాను, డ్యూటీ చాట్ లో నా పేరు ఉందా ? ఇందులో నేను బాధ్యుడిని ఎలా అవుతానంటూ ఈ. ఓ ను ప్రశ్నించినట్టు సమాచారం.
ఆలయంలో హుండీ బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగికి మెమో ఇవ్వడంతో, రాత్రి వరకు ఆరుగురు అర్చకులు విధులు నిర్వహించాల్సి ఉండగా, గురువారం సాయంత్రం కేవలం ఒక్క అర్చకుడు, పరిచారకుడు మాత్రమే డ్యూటీలో ఉన్నారని ? వారికి మేము ఎందుకు ? ఇవ్వలేదంటూ ఈ .ఓ కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

ఇదిలా ఉండగా. ప్రతిరోజు కొందరు అర్చకులు, ఓ అధికారికి, ఆలయ మంటపంలో విధులు నిర్వహించే వారికి, మరి కొందరికి, సంభవనలు. సమర్పించుకుంటారనే, ఆరోపణలు ఉన్నాయి.


అంతుబట్టని దొంగలు ఆంతర్యం ?


ఆలయంలో దొంగలు ప్రవర్తించిన తీరు, వారి ఆంతర్యం ఏమిటో ,? అంతుపట్టక పోలీస్ తో పాటు, ఆలయ అధికారులు సైతం తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం.
దాదాపు 10 కిలోల వెండి ఆంజనేయ ఉత్సవమూర్తిని, పాదుకులను, ఇతర వెండి, బంగారు వస్తువుల ను. తాకకపోవడం, అదే ప్రాంగణంలో కానుకలతో నిండిన ఐదు హుండీలు ఉన్న వాటిని తెరిచే యత్నం చేయకపోవడం ( హుండీలలో దాదాపు కోటి రూపాయలకు పైగా ఉండవచ్చని భక్తులు అధికారుల అంచనా) . కొబ్బరికాయలు కొట్టే. సమీప గదిలో ఉన్న లాకర్లు, బీరువాలలో క్వింటాల కొద్ది స్వామివారి వెండి ఆభరణాలు భద్రపరుస్తుంటారు. దొంగల కేవలం అంతరాలయంలో కొన్ని వస్తువులు ఎత్తుకెళ్లడంలో వారి ఆంతర్యం ఏమిటో ? దొంగలు చెప్పితే కానీ తెలియని పరిస్థితి నెలకొంది.
దేవాదాయ శాఖ కమిషనర్ శాఖ పరంగా విజిలెన్స్ విచారణ చేపడితే కొండగట్టు ఆలయ అధికారుల పాలను తీరు వెలుగు చూసే అవకాశం ఉందనే చర్చ భక్తులలో నెలకొంది