కొండగట్టు ..లో అర్చక పోస్టులు కొల్లగొట్టారా ?

J.Surender Kumar,

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో విధులు నిర్వహించిన, నిర్వహిస్తున్న కొందరు అధికారులు. ఆడిట్ అధికారుల. అభ్యంతరాలు బేకాతరు చేస్తూ కొట్లాది రూపాయల రికవరీ మరిచారు. అంజన్న ఆదాయ, దుస్థితి అలా ఉంటే. అర్చక పోస్టులను కొందరు అర్చక స్వాములు నిబంధనలకు విరుద్ధంగా కొల్లగొట్టారు అనే ఆరోపణలు ఉన్నాయి.

దేవాదాయ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన నిరుద్యోగం అర్చక స్వాములు ఫిర్యాదు ప్రతి!

అర్చక పోస్టుల ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్చక నిరుద్యోగులు, తమకు అన్యాయం జరిగిందంటూ. బందు ప్రీతితోనే ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు తన రక్త సంబంధీకులను ఎంపిక చేశారని, ఇంటర్వ్యూలను రద్దుచేసి తమకు న్యాయం చేయాలని. నిరుద్యోగ అర్చక స్వాములు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.
నేడు కొండగట్టు క్షేత్రంలో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అంజన్న స్వామికి న్యాయం జరుగుతుందనే నమ్మకం విశ్వాసం భక్తజనంలో నెలకొంది.