మహిళ పక్షపాతి ప్రభుత్వం – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం!

ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ !

J.Surender Kumar,

జగిత్యాల పట్టణానికి చెందిన 107 మంది ఆడబిడ్డలకు షాది ముభారక్ ద్వారా మంజూరైన 1 కోటి 7 లక్షల రూపాయలు చెక్కులను, 56 మందికి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన 56 లక్షల రూపాయల చెక్కులను సోమవారం జగిత్యాల ఎమ్మెల్యే స్థానిక రాయల్ ఫంక్షన్ హాల్ లో పంపిణీ చేశారు.

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 4520 డబుల్ బెడ్ రూం ఇండ్ల ను మహిళల పేరు పైన ఇవ్వడం జరుగుతుంది.
ఇండ్ల లేని నిరుపేదలకు అందరికీ ఇండ్లు వస్తాయి..
మాతాశిశు ఆసుపత్రి నిర్మాణం ద్వారా పేదలకు.మెరుగైన వైద్యం…

మెడికల్ కాలేజీ కి మరొక 150 కోట్లు మంజూరు అయ్యాయి అని అన్నారు.
ఆరోగ్య లక్ష్మి పథకం తో పాటు గా వచ్చే నెల నుండి కేసిఆర్ న్యూట్రిషన్ కిట్లు కూడా అందజేస్తాం అని అన్నారు.
మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశామని అన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్,మైనార్టీ పార్టీ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ ముజాహిధ్,కౌన్సిలర్ లు,కో ఆప్షన్ సభ్యులు,రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.