డిసిసి అధ్యక్షుడు ఏ. లక్ష్మణ్ కుమార్ !
J. Surender Kumar.
భోజనం సరిగా లేదని ఫిర్యాదు చేసిన గురుకుల బాలికల విద్యార్థులను చితకబాదిన ప్రిన్సిపాల్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ? మంత్రి కొప్పుల ఈశ్వర్ సమాధానం చెప్పాలని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు.
ధర్మపురి పట్టణంలో మంగళవారం లక్ష్మణ్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
వసతి గృహంలో భోజనం సరిగా వండటం లేదని ఫిర్యాదు చేసిన 20 మంది విద్యార్థుల పైన ప్రిన్సిపాల్ వాతలు పడేలా కొట్టడం జరిగిందని
ఇంత జరుగుతున్నా కూడా సంక్షేమ శాఖకు మంత్రి కొప్పుల ఈశ్వర్ ఏం చేస్తున్నారు.? అంటూ సంఘటన 17 న జరుగుతే. నేటికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం అన్నారు.
మంత్రి ఈశ్వర్ రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరిస్తున్నారా ? లేదా ధర్మపురికి మంత్రిగా వ్యవరిస్తున్నారా..? ప్రశ్నించారు.
సంఘటన జరిగి నాలుగు రోజులు గడిచిన ఇప్పటివరకు తన శాఖ అధికారులను పంపడం కానీ లేదా తానే స్వయంగా పర్యటించడం కానీ అక్కడి సమస్యలను తెలుసుకోవడం కానీ చేయడం లేదు..
మంత్రికి ధర్మపురిలో క్రికెట్ టోర్నమెంట్లను పెట్టడం, ఉగాది ఉత్సవాలు నిర్వహించడం పట్ల ఉన్న శ్రద్ధ, హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పైన లేదు. అని ఆరోపించారు.
తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ శాతం ముందుండి పోరాడింది దళిత వర్గానికి చెందినవారు అని . ఆ వర్గానికి చెందిన పిల్లలు ఇప్పుడు హాస్టల్లో ఇంతటి దుర్లభమైన పరిస్థితిని ఎదుర్కొంటే మంత్రి ఈశ్వర్ ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నించారు.
నాలుగు సంవత్సరాల నుండి 31 జిల్లాలో ఏ ఒక్క హాస్టల్లోనైనా విద్యార్థులతో కలిసి ఒకరోజు నిద్ర చేశారా..? మంత్రికి రోజంతా ధర్మపురిలో ఇతర పార్టీ నాయకులను ఏ విధంగా కొనుగోలు చేయాలి ఏ విధంగా తమ పార్టీలోకి తీసుకోవాలి. ఎల్.ఎం కొప్పుల ట్రస్ట్ ద్వారా క్రీడల పోటీలు, ఉత్సవాలు నిర్వహించడంపై ఉన్న ఆత్రుత మరి హాస్టళ్లపైన, హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పైన ఎందుకు ఉండటం లేదు అని ప్రశ్నించారు .
ఈ సమావేశంలో ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగణ బట్ల దినేష్, ధర్మపురి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సింహరాజు ప్రసాద్, ధర్మపురి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మొగిలి వేముల రాజేష్, సీపతి సత్యనారాయణ, అప్పం తిరుపతి,ఆశెట్టి శ్రీనివాస్, అంతర్పుల దేవ వరం,పోషన్న తదితరులు పాల్గొన్నారు..