J. Surender Kumar,
జగిత్యాల పట్టణంలోని జండా మెహల్ గల రహేమనియా మస్జీద్ అభివృద్ధి నిమిత్తం నిధులు కేటాయించాలని కోరుతూ మస్జిద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ అజిమోద్దీన్, ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కలిసి వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే తో మాట్లాడుతూ అభివృద్ధికి రహేమనియా మస్జీద్ అభివృద్ధి కి నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సయ్యద్ అజిమోద్దీన్, ఉపాధ్యక్షులు, రియాజ్ మామ, మునిరోద్దీన్, అస్గర్ మహమ్మద్ ఖాన్, మోసిన్, జవిద్, అజార్, సోఫి, లియాకత్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
జగిత్యాల మండలాల బి.సి. అధ్యక్షునిగా బందెల మల్లయ్య నియామకం.!

హైదరాబాదులో బిసి ముఖ్య నాయకుల సమావేశం లో రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జగిత్యాల మండలం చల్‍గల్ గ్రామానికి చెందిన మున్నూరుకాపు కులస్తుడు బందెల మల్లయ్యని జగిత్యాల జిల్లా బి.సి. సంక్షేమ సంఘం జగిత్యాల రూరల్ & అర్బన్ మండలాల అధ్యక్షునిగా నియమించారు. బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి మూసిపట్ల లక్ష్మీనారాయణ ప్రకటనలో తెలిపారు.
వెయ్యి కొబ్బరికాయలు కొట్టారు కెసిఆర్ కు అభిషేకం చేశారు!

కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థాన అభివృద్ధికి 100 కోట్ల రూపాయల నిధులు మంజూరుకు గానూ ముఖ్యమంత్రి కేసిఆర్ కు కృతజ్ఞతా భావంతో ముత్యంపెట గ్రామ సర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డి సారథ్యంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మరియు గ్రామ ప్రజలు స్థానిక గ్రామ పంచాయతీ అవరణ నుండి కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం వరకు కాలి నడకన వెళ్లి 1001 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు.,
