కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం !
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి!
J.SURENDER KUMAR,
తన నిర్లక్ష్యంతో జరిగిన ప్రమాదానికి బాధ్యత వహిస్తూ ఆదుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ధర్మపురి మండలంలోని నాగారం గ్రామానికి చెందిన పసుల అనిల్ రోడ్డు ప్రమాదంలో గాయపడి శుక్రవారం మృతి చెందాడు. శనివారం కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి , జగిత్యాల జిల్లా డీసీసీ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ పరామర్శించి ఓదార్చారు. అనిల్ మృతదేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని కాంట్రాక్టర్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ ప్రమాదం గురించి సంబంధిత ENC అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనిల్ అంతిమయాత్ర లో పాల్గొని పాడె మోశారు. అనిల్ కుటుంబానికి 10వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు.అనిల్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు.

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దినేష్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మొగిలి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.