డిసిసి అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్!
J.Surender Kumar,
ధర్మపురి లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి శుక్రవారం ఆస్పత్రిలో మృతి చెందిన పసుల అనిల్ కుటుంబానికి, న్యాయం జరగాలని , కాంట్రాక్టర్, సంబంధిత శాఖ అధికారులపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు శుక్రవారం సాయంత్రం అంబేద్కర్ చౌరస్తా రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.

మండలంలోని నాగారం గ్రామానికి చెందిన పసుల అనిల్, ఆదివారం పనులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ధర్మపురి పట్టణ అభివృద్ధి పనులలో భాగంగా కమలాపూర్ దారిలో గల పెట్రోల్ బంక్ వద్ద గా కల్వర్టు పనులు పూర్తి చేయకుండా నిలిపివేయడంతో. అనిల్ ప్రమాదవశాత్తు అందులో పడి తలకి తీవ్ర గాయం కావడంతో శుక్రవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు

. బాధిత కుటుంబానికి న్యాయం చెయ్యాలని,కాంట్రాక్టర్ పైన,సంబంధిత అధికారుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మృతుడి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని ధర్నాను విరమింప చేశారు.