షుగర్ ఫ్యాక్టరీ ప్రధాన గేటుకు ఉరితాడు సిద్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు!
సీఎం ఎమ్మెల్యే ఎంపీ దిష్టిబొమ్మలు దగ్ధం!
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ కర్మాగారం మూసివేసి నేటికి ఎనిమిది సంవత్సరాల రెండు నెలల అవుతుందని కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు. టీపీసీసీ నేత జువ్వాడి కృష్ణ రావు ఆధ్వర్యంలో రైతుల పక్షాన నిలబడి షుగర్ ఫ్యాక్టరీ వెంటనే తెరిపించాలని నిరసనగా చిట్టాపూర్ గ్రామం నుండి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ వరకు పాదయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగ్ రావు మాట్లాడుతూ బంగారు తెలంగాణ అంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలైన చెక్కర ఫ్యాక్టరీ మూసి వేయడమా?
బి ఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుండి రైతులను మీద అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం బాధాకరమని అన్నారు. నడుస్తున్న ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని మూసివేసిన ఘనత

బి ఆర్ఎస్ ప్రభుత్వందని అన్నారు. గత ఎన్నికల సమయంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని కచ్చితంగా తెరిపిస్తానని హామీ ఇచ్చి ఒకవేళ తెరిపించకపోతే ఇదే ఫ్యాక్టరీ గేటుకి ఉరి వేసుకుంటానని అన్నారు. కానీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత షుగర్ ఫ్యాక్టరీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని అన్నారు. ఇప్పటికి కూడా చెరుకు రైతులు మరియు ఫ్యాక్టరీ కార్మికుల బాగు కోసం ఇసుమంతైన కృషిచేసిన దాఖలు లేదని నర్సింగ్ రావు మండిపడ్డారు. గతంలో ఇక్కడి నుండి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన కల్వకుంట్ల కవిత గారు కూడా షుగర్ ఫ్యాక్టరీని 100 రోజుల్లో తెరిపిస్తానని మాట ఇచ్చి నెరవేర్చకుంటే ఈ ప్రాంత రైతులు వారికి తగిన బుద్ధి చెప్పారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కోరుట్ల ఎమ్మెల్యే గారిని చెరుకు రైతులు సమాధి చేయడం తధ్యమని అన్నారు. అనంతరం టిపిసిసి నేత జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ చెరుకు రైతుల ఉసురు కేంద్ర.రాష్ట్ర ప్రభుత్వాలకు తగులుతుందని అన్నారు.

. గత ఎన్నికల సమయంలో ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ బాండ్ పేపర్ అరవింద్ ఫ్యాక్టరీ కొనుగోలు చేసి నడిపిస్తానని కళ్ళబోళ్ళు మాటలు చెప్పి రైతులను మోసం చేసి గెలిచారని అన్నారు. రైతుల భయంతో బాండ్ పేపర్ అరవింద్ ఇప్పుడేమో అదనపు భద్రత తో వీధుల్లో పార్లమెంట్లో తిరిగే దుస్థితి వచ్చిందని అన్నారు. నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు అన్ని రకాలుగా న్యాయం చేసిందని అని అన్నారు. .భవిష్యత్తులో రైతులకు న్యాయం చేసేది ఒక కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు. రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మూసి వేసిన షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని తెలిపిన విషయాన్ని మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నామని టిపిసిసి నేత
జువ్వాడి కృష్ణారావు అన్నారు.. ఇప్పటి నుండి ప్రతి నెల 22 తేదీన. అక్టోబర్ వరకు ఒక్క ఒక్క గ్రామం నుండి షుగర్ ఫ్యాక్టరీ వరకు పాదయాత్ర చేస్తాం అని రైతుల పక్షణా కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రభుత్వనికి కనువిప్పు కలిగేలా చేస్తాం అని అన్నారు.

అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్. నిజామాబాద్ ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పుండ్ర శ్రీనివాస్ రెడ్డి.చిట్టాపూర్ సర్పంచ్ సాయి.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజిరెడ్డి. కంది బుచ్చి రెడ్డి. బాలుసాని ప్రణయ్ గౌడ్. యాల శేఖర్ రెడ్డి. చెరుకు సంఘం మాజీ అధ్యక్షులు నారాయణరెడ్డి. యల్లా శ్రీనివాస్. కాసార భూమక్క. గడ్డం లింగారెడ్డి. అచ్చ రాజేశం. అరుణ్ రెడ్డి. మగ్గని నరేష్. చిన్న అంజన్న. చింతలపల్లి రాజిరెడ్డి. ఏలూరు వెంకట్ రెడ్డి. వాకిడి భూమా రెడ్డి. కోరుట్ల పట్టణ అధ్యక్షుడు తిరుమల గంగాధర్. కోరుట్ల మండల అధ్యక్షుడు కొంతం రాజం. మెట్పల్లి మండల అధ్యక్షుడు అంజిరెడ్డి. ఇబ్రహీంపట్నం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూడ శ్రీకాంత్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింగారెడ్డి. బెజ్జరపు శ్రీనివాస్. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సత్యనారాయణ. యువజన కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి. మల్లాపూర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శేఖర్. మెట్పల్లి పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జెట్టి లక్ష్మణ్. ఇబ్రహీంపట్నం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లక్కిడి నర్సక్క. చెక్కపల్లి కిషన్. సుద్దాల మురళి తదితరులు పాల్గొన్నారు…