నడక కు నాట్యం నేర్పుతున్న రోడ్డు అది !!

వాహన ప్రయాణలో పదనిసల ప్రమాదాలు !!

J.SURENDER KUMAR,

ఆ రోడ్డుపై పై నడుచుకుంటూ వెళ్తే ఎలాంటి నాట్య శిక్షణ అవసరం లేకుండా పాదచారులకు నాట్యం వస్తుంది.. వాహనాలతో రోడ్డు గుండా ప్రయాణిస్తే. ఏ బ్రాండ్ వాహనం అయినా సరే ,సరిగమ పదనిసల శబ్దాలు కచ్చితంగా వస్తాయి. స్వల్ప ప్రమాదాలు, కూడా సంభవిస్తాయి.

ప్రమాదంలో రక్త గాయాలు అయినవారు రోధిస్తూ గాయకులు గా మారుతారు. ఇన్ని లక్షణాలు, అవలక్షణాలు గల రోడ్డు ఉన్నది ఎక్కడో తెలుసా ? జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరం నుంచి మొదలవుతుంది.


వివరాలు ఇలా ఉన్నాయి !
జగిత్యాల పట్టణ మున్సిపల్ పరిధి శంకులపల్లి, రైతు విగ్రహం నుండి కిస్టంపేట్ , కండ్లపల్లి, అల్లిపూర్ స్కూల్ వరకు. వెళ్లే రోడ్డు పాదచారుల, వాహనాదారుల పాలిట నరక మయంగా మారింది.

రోడ్డుపై అడుగడునా గుంతలే, చిన్న వర్షం చినుకులు పడిన గుంతల్లో చేరిన బురద నీళ్లు తో పాదాచారుల కు హోలీ పండగే అవుతుంది. అక్కడే ఉన్న మోడల్ స్కూల్ కు వెళ్లే విద్యార్థులు అవస్థలు వర్ణనాతీతం.

అర్ధరాత్రి ఆ రోడ్డుపై వాహన ప్రమాదాలు సంభవిస్తే క్షతగాత్రులను ఆ పరమాత్ముడే కాపాడవలసి ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రోడ్డు మరమ్మతులకు నోచుకోకపోవడం, నూతన రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడం ఆ రోడ్డుపై ప్రయాణించే ప్రజల పాలిట శాపంగా మారింది.

జిల్లా యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఆధునిక యంత్రాలతో రోడ్డు మరమ్మతులు చేపట్టాల్సిందిగా ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.