నేడు జాతీయ లోక్ అదాలత్.. జగిత్యాల జిల్లాలోని అన్ని కోర్టులలో…

జిల్లా సెషన్స్ జడ్జి , జి నీలిమ !

J. Surender Kumar

జగిత్యాల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం (ఫిబ్రవరి 11న) జిల్లాలోని అన్ని కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ లు నిర్వహించబడతాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, మరియు జిల్లా సెషన్స్ జడ్జి జి. నీలిమ, సెక్రటరీ మరియు సీనియర్ సివిల్ జడ్జి ఏ. ప్రసాద్ తెలిపారు.

ఈ సంవత్సరం నాలుగు జాతీయ లోక్ అదాలత్ లు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా, శనివారం మొదటి లోక్ అదాలత్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని కోర్టులలో…క్రిమినల్, సివిల్ మరియు మోటార్ వాహన చట్టం సంబంధించిన కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మరియు చిట్ ఫండ్ లకు సంబంధించిన కేసులను, ఇరుపక్షాల సమ్మతితో రాజీతో పరిష్కారమయ్యే కేసులన్నింటినీ పరిష్కరించడం జరుగుతుందని వివరించారు. ఈ కేసులకు సంబంధించి గుర్తించిన కక్షిదారులకు నోటీసులను అందజేయడం జరిగిందని వివరించారు.