పంచాయతీ కార్యాలయానికి ₹11 కోట్ల కరెంట్ బిల్లు !

తెలంగాణలోనే..

J.Surender Kumar,
కామారెడ్డి జిల్లాలో ఓ  పంచాయతీ కార్యాలయానికి ₹11.41 కోట్ల కరెంటు బిల్లు రావడంతో పాలకవర్గంతో పాటు గ్రామ ప్రజలు విస్మయానికి గురయ్యారు.

జిల్లాలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీ అధికారులకు విద్యుత్ శాఖ వారు ఇచ్చిన బిల్లును చూసి అధికారులతో పాటు పాలకవర్గ సభ్యులు షాక్ కు గురి అయ్యారు.  మొత్తం బిల్లు రూ.11,41,63,672. (పదకొండు కోట్ల నలుబది ఒక్క లక్షల, 63 వేల 672 రూపాయలు)
బిల్లులో తప్పిదం వెనుక  సాంకేతిక సమస్య ఉందని అధికారులు పేర్కొన్నారు . 

విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఇష్టానుసారంగా ప్రవర్తించడంతోనే ఇది వచ్చిందని సాంకేతిక సమస్య ఉండకపోవచ్చు పంచాయతీ అధికారులు ప్రజలు అంటున్నారు.