J. Surender Kumar,.
పాత్రికేయ దిగ్గజం, జర్నలిజం విలువలకు ప్రతిరూపం, ప్రముఖ రచయిత ( డాక్టర్. అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్ ) ఏబీకే ప్రసాద్ కు(National award for excellency in journalism 2020) సంవత్సరానికి జర్నలిజంలో జాతీయస్థాయి అవార్డుకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసింది.”రాజా రామ్మోహన్ రాయ్ నేషనల్ అవార్డు”
ఈ మేరకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్. జస్టిస్ శ్రీమతి రజన ప్రకాష్ దేశాయి, ప్రకటించారు. ఫిబ్రవరి 28న ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో డిప్యూటీ స్పీకర్ హాల్లో అవార్డును ఏబీకే ప్రసాద్ ప్రధానం చేయనున్నట్టు ఏబీకే ప్రసాద్ కు పంపిన సమాచార పత్రంలో పేర్కొన్నారు.

ఈ మేరకు IJU జాతీయ అధ్యక్షుడు కే శ్రీనివాస్ రెడ్డి, ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, తెలంగాణ టియుడబ్ల్యూజే అధ్యక్ష, కార్యదర్శులు శేఖర్, విరహత్ అలీ జర్నలిస్టులు నాయకులు హర్షం వ్యక్తం చేశారు.