ప్రజాస్వామ్య పరిరక్షకులు పాత్రికేయులు..
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి!

J.Surender Kumar,

ప్రింట్, ఎలక్ట్రానిక్ పాత్రికేయులు సమాజ హితమే లక్ష్యంగా ప్రజలకు సమాచారం చేరవేయడంలో చేస్తున్న కృషి ఎనలేనిదని. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కొనియాడారు.,

బీర్పూర్ మండల కేంద్రంలో బుధవారం జరిగిన టీయూడబ్ల్యూజే నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ముఖ్య అథితిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ
భారత రాజ్యాంగంలో నాలుగో స్తంభంగా పేర్కొన్న పాత్రికేయ వృత్తి పవిత్రమైనదని మారుమూల మండలమైన బీర్పూర్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకుని ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంతోపాటు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేస్తూ పాత్రికేయులు
అభినందనీయమన్నారు.

ప్రభుత్వలు చేస్తున్న చట్టాల అమలులోల పాత్రికేయ రంగం కృషి వెలకట్టలేనిది., పాత్రికేయులను ప్రభుత్వం అన్నిరకాలుగా ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు., ప్రతి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసేలా అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు నిధులు సమకూర్చడంలో తనవంతు సహకారం అందిస్తానని జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. పాత్రికేయులు నిరుపేదల పక్షాన నిలుస్తూ, అట్టడుగు వర్గాల గొంతుకగా నిలుస్తున్నారనీ అన్నారు .పాత్రికేయులు తమ కథనాలతో ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగిందో తెలియజేస్తూ, తమ జీవితాలను సమాజానికి అంకితం చేసిన పాత్రికేయులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పథకాలను అర్హులకు అందేలా, ఇటు అధికారులను ఆటు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, సక్రమ మార్గంలో నడిపిస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాత్రికేయలు కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
గొడిసెల రమేష్ మండల్ ప్రెసిడెంట్, సాతర్ల మహేష్, ప్రధాన కార్యదర్శి, గుమ్మడి రమేష్ ఉపాధ్యక్షుడు, చింత కృష్ణ , చీర్నేని శ్రీనివాస్
సంయుక్త కార్యదర్శి, తోట నరేందర్, పురంశెట్టి శ్రీనివాస్ కోశాధికారి, అడెపు రవి ఆర్గనైజింగ్ సెక్రెటరీ లను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీర్పోర్ ఎంపీపీ మసర్తి రమేశ్, టీయూడబ్లూజే జిల్లా ప్రధాన కార్యదర్శి అల్గనూరి ప్రదీప్, ఉపాధ్యక్షుడు గడ్డల హరికృష్ణ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి శోభన్, నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.


ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అభినందనలు!


బీర్ పూర్ మండల ప్రెస్ క్లబ్ సభ్యులను కలిసి అభినందించి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు రామచంద్ర రావు, కే. రమణ తదితరులు ఉన్నారు.