ఏపీ ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్!
J. Surender Kumar,
పట్టుదల, చిత్తశుద్ధి, అంకితాభావంతో అవిశ్రాంతంగా శ్రమిస్తూ, తన నియోజకవర్గాన్ని అభివృద్ధికి కేరాఫ్ అడ్రెస్ గా మార్చిన ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు లాంటి ఆదర్శ ప్రజాప్రతినిధులు నియోజకవర్గానికి ఒకరుంటే రాష్ట్ర రూపురేఖలే మారిపోతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ ప్రశంసించారు.

బుధవారం ఆయన సిద్దిపేటలో ఓ శుభకార్యానికి హాజరైన సందర్భంగా కోమటి చెరువును సందర్శించి, బోటింగ్ చేశారు. అనంతరం తనను కలిసిన మీడియాతో మాట్లాడారు. కొన్నేళ్ల వ్యవధి తర్వాతా తాను ఈరోజున సిద్దిపేట పట్టణాన్ని పర్యటించానని, అభివృద్ధిలో అప్పటి సిద్దిపేటకు, ఇప్పటి సిద్దిపేటకు పోల్చలేనంత తేడా ఉన్నట్లు ఆయన అన్నారు.

అన్నీ రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించడంతో సిద్దిపేట రూపురేఖలు మారిపోయినట్లు అమర్ అన్నారు. ఆయన వెంట తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీ, జిల్లా అధ్యక్షులు కే. రంగాచారీ, ప్రజాతంత్ర సంపాదకులు దేవులపల్లి అజయ్ తదితరులు ఉన్నారు.
