ఆర్ డబ్ల్యూ ఎస్ ఎ.ఇ. వివేక్ ను సస్పెండ్ చేయండి!

ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు!

J.SURENDER KUMAR,

చేయని పనులకు దొంగ ఎంబి రికార్డులు, బిల్లులు పొందిన పాత పనులకే కొత్త రికార్డులు తయారు చేసిన ఆర్ డబ్ల్యూ ఎస్ ఎ.ఇ. వివేక్ ను, ఇతర బాధ్యులందరినీ సస్పెండ్ చేస్తూ, పూర్తిగా పదవి నుండి తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ కు సోమవారం ప్రజావాణిలో తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి పిర్యాదు చేశారు.

జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామంలో చేయని పనులకు చేసినట్లుగా, బిల్లులు పొందిన పాత పనులకే మళ్లీ కొత్తగా తప్పుడు ఎంబి రికార్డులు తయారు చేశారని ఆయన పిర్యాదు లో వివరించారు.
ఆర్ డబ్ల్యూ ఎస్ ఎ.ఇ. వివేక్ ను సస్పెండ్ చేసి, తగు న్యాయ విచారణ జరిపించి కోట్లాది రూపాయల నిధుల దుర్వినియోగానికి బాద్యులైన ప్రతి ఒక్కరినీ పదవుల నుండి పూర్తిగా తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని ఫిర్యాదు పత్రంలో చుక్క గంగారెడ్డి పేర్కొన్నారు.