J.SURENDER KUMAR,
బీర్పూర్ మండల కేంద్రంలో మీరు నేను కార్యక్రమంలో భాగంగా పల్లెనిద్ర చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బుధవారం ఉదయం బీర్పూర్ గ్రామంలో పలు వార్డులలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ అధికారుల ద్వారా వాటిని పరిష్కరిస్తూ గ్రామంలో పర్యటించారు.
గ్రామంలో సెలూన్ షాప్ కు వెళ్లిన ఎమ్మెల్యే నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వము ఇస్తున్న ఉచిత విద్యుత్ కార్యక్రమంపై అడిగి తెలుసుకోగా నాయి బ్రాహ్మణులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

గ్రామంలో గొర్లకు నట్టల నివారణ మందులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సబ్సిడీ గొర్ల పథకంపై ఆరా తీయగా యాదవ సంఘం నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.
అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నారు అని అన్నారు..అనంతరం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఈ కార్యక్రమంలో KDCC జిల్లా మెంబర్ రాంచందర్ రావు,జిల్లా రైతుబందు సమితి సభ్యులు రమణ,సర్పంచ్ శిల్ప రమేష్,ఉప సర్పంచ్ హరీష్,మండల పార్టీ అధ్యక్షులు నారపాక రమేష్,యూత్ అధ్యక్షులు రామచంద్రం గౌడ్,గ్రామ శాక అధ్యక్షులు సుధాకర్,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
