సంత్ సేవాలాల్ మహారాజ్ అందరివాడు!

ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు!

J. SURENDER KUMAR

సంత్ సేవాలాల్‌ మహారాజ్‌ కేవలం గిరిజనుల ఆరాధ్య దైవం మాత్రమే కాదని, అందరికీ ఆరాధ్యుడేనని అన్నారు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు.
మెట్టుపల్లి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన సంతు సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలలో కల్వకుంట్ల విద్యాసాగర్ రావు .. ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా యువతులు, మహిళలతో కలిసి బంజారా సాంప్రదాయ నృత్యంతో సందడి చేసిన ఎమ్మెల్యే ప్రత్యేక బోగ్, బండర్ పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
గిరిజ‌నుల‌కు ద‌శ‌-దిశ‌ను చూపి, హైందవ ధ‌ర్మం గొప్ప‌ద‌నం, విశిష్ట‌తల‌ను తెలియ‌ జేయడానికే సేవాలాల్ మ‌హారాజ్ జ‌న్మించారని చరిత్రకారులు చెబుతారని తెలిపారు. బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్ర‌పంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేశారని వెల్లడించారు. దీంతో శ్రీ సంత్‌ సేవాలాల్ ఇత‌ర కులాల వారికి కూడా ఆదర్శ మూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాలని సూచించారు.
గిరిజనుల అభివృద్ధికి, సంస్కృతి, సాంప్రదాయాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నారని తెలిపారు.
సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి వేడుకలు అధికారికంగా తెలంగాణ రాష్ట్రంలో తప్ప దేశంలో ఇంకెక్కడా జరపడం లేదంటే ఇది మన రాష్ట్ర గొప్పతనమని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 24 కోట్ల రూపాయలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా గిరిజనుల ఆత్మగౌరవం ప్రతిబింభించేలా సేవాలాల్ బంజారా భవనాన్ని సీఎం కేసీఆర్ నిర్మించారు అని పేర్కొన్నారు.

తెలంగాణలో అన్ని కులాలు, మతాలు, సమానంగా గౌరవిస్తూ సాంప్రదాయాలు, ఆచారాలను సీఎం కేసీఆర్ కాపాడుతున్నారని తెలిపారు. మెడికో విద్యార్థి ప్రీతి అకాల మరణం కు కారకులైన షైఫ్ కు కఠిన శిక్ష వేయాలని,వారి మృతి పై రెండు నిమిషాలు మౌనం వహించారు.
ఇట్టి కార్యక్రమంలో RTO శ్యాం నాయక్,ఎస్సి ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాదవ్ వెంకట్రావు, బంజారా యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ నాయక్, గారు, మున్సిపల్ చైర్ పర్సన్, రణవేని సుజాత , వైస్ చైర్ పర్సన్ వెంకటేశ్వరరావు, మెట్టుపల్లి ఎంపీపీ, మల్లాపూర్ ఎంపీపీ, జెడ్పిటిసి, మరియు సర్పంచులు,ఉత్సవ కమిటీ సభ్యులు భూక్య గోవింద్ నాయక్, జరుపుల రాయల్, నునవాత్ రాజు, జరుపుల గోవింద్, గుగ్లవత్ శివాలాల్, జరుపుల వసంత్ ,రాజేందర్, భీంరాజ్, భూమా నాయక్, రమేష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.