శివనామ స్మరణలతో మారుమోగిన ఆలయాలు !

ధర్మపురి క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం!

J.SURENDER KUMAR,

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలోని శనివారం తెల్లవారుజాము నుండే ఆలయాలు భక్తుల శివనామస్మరణలతో మారు మోగాయి. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని భక్తులు గోదావరి నదిలో స్నానాలు ఆచరించడంతో గోదావరి తీరం భక్తజనంతో నిండిపోయింది..

స్థానిక శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం శ్రీ అక్క పెళ్లి రాజరాజేశ్వర స్వామి ఆలయం, గౌతమేశ్వరాలయం తదితర ఆలయాల్లో భక్తి తెల్లవారుజామునందు స్వామివారి దర్శించుకోవడానికి బారులు తీరారు.

శివాలయాలు మహాన్యాస రుద్రాభిషేకాలు ప్రత్యేక పూజలు నిరంతరం కొనసాగాయి. బస్టాండ్ నుండి నంది వరకు, అంబేద్కర్ చౌక్ నుండి నంది విగ్రహం వరకు.

నంది విగ్రహం నుండి ఆలయం వరకు రహదారులు భక్తజనంతో కిక్కిరిశాయి. మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు, స్వామీ ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

నేరెళ్ల గ్రామంలోని సాంబశివుడు ఆలయంలో, బుగ్గారంలోని. సాంబశివ నాగేశ్వర స్వామి ఆలయంలో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.


, దేవాలయ ఆవరణలో ‌నక్క రాజు ఆధ్వర్యంలో “24 గంటల నిర్విరామ మహాసంకల్ప గాన స్వరాభిషేకం” కార్యక్రమంలో పాల్గొని నక్క రాజు మంత్రి ఈశ్వర్ దంపతులు
గాయకుడు రాజు ను సన్మానించారు.