శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న హీరో నితిన్ దంపతులు!

J. Surender Kumar,

ప్రముఖ సినీ హీరో నితిన్ దంపతులు ఆదివారం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
వీరికి దేవస్థానం పక్షాన సాదరంగా స్వాగతం పలికి పూజల అనంతరం అర్చకులు ఆశీర్వచనం ఇచ్చిన తదుపరి దేవస్థానం రెనవేషన్ కమిటి సభ్యులు ఇందారపు రామయ్య కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ శేష వస్త్రం ప్రసాదం అందజేశారు
.

హీరో నితిన్ స్నేహితుడైన కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి నర్సింగరావు ను తిమ్మాపూర్ లో ఆయన ఇంట్లో కలిసి తేనేటివిందు స్వీకరించారు. హీరో నితిన్ ను చూడడానికి అభిమానులు ఎగబడ్డారు.

యమధర్మరాజుకు ప్రత్యేక పూజలు!

” భరణి నక్షత్రం ” పురస్కరించుకుని శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం నకు అనుబంధ దేవాలయమైన శ్రీయమధర్మరాజు వారి దేవాలయం లో ఆదివారం స్వామివారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం, ఆయుష్యసూక్తం తో అబిషేకం, ఆయుష్షు హోమం తదుపరి హరతి మంత్రపుష్పం కార్యక్రమంలు అత్యంత వైభవంగా  నిర్వహించడం  నిర్వహించారు.  వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ, ముత్యాల శర్మ ,  అర్చకులు నేరెళ్ల సంతోష్ కుమార్, వొద్దిపర్తి కళ్యాణ్ కుమార్,బొజ్జ సంతోష్ కుమార్ ,బొజ్జ సంపత్ కుమార్ , ప్రదీప్ కుమార్ . ఆధ్వర్యంలో జరిగాయి.

కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ ,  రెనవేషన్ కమిటి సభ్యులు ఇందారపు రామయ్య ,సభ్యులు గునిశెట్టి రవీందర్ , ఇనగంటి రమ వెంకటేశ్వరరావు , వేముల నరేష్ , గందె పద్మ , పల్లెర్ల సురేందర్, అక్కనపల్లి సురేందర్ , చుక్క రవి,  మరియు సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.


ఘనంగా నివాళి          

                
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఏ.ఎల్ మల్లయ్య అకాల మరణం గంగపుత్రులకు తీరని లోటని ధర్మపురి గంగపుత్ర సంఘం అధ్యక్షుడు మూట రమేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమంలో గంగపుత్ర సంఘం  ఉపాధ్యక్షుడు గరిగే రమేష్, కార్యదర్శి నర్ముల శ్రీధర్, సభ్యులు గడప శ్రీను, కొమిరెల్లి నరేష్, నాగుల శంకర్,  పెద్దమనుషులు గడప గంగారాం, కొమిరెల్లి మల్లేశం, బాకీ శంకర్ మరియు సభ్యులు పాల్గొన్నారు.