సైన్యంలో ఎంపికై శిక్షణ పేరిట విద్యార్థులకు టోకరా!

జగిత్యాల కేంద్రంగా దేహ దారుడ్య పరీక్షలు!

వేలాది రూపాయల వసూళ్లు.?

నిర్వాహకుల ఫోన్లు స్విచ్ ఆఫ్ !

J. Surender Kumar,

కొందరు సభ్యులు జగిత్యాల జిల్లాలో సైన్యంలో ఎంపికై శిక్షణ పేరిట మోసాలకు శ్రీకారం చుట్టారు. అభం శుభం తెలియని కొందరు పదవ తరగతి విద్యార్థులనే లక్ష్యంగా చేసుకొని దేహ దారుడ్య పరీక్షలు పేరిట వారి నుంచి వేలాది రూపాయలు వసూలు చేసినట్టు సమాచారం. రెండు మూడు రోజుల తర్వాత తాము సైన్యంలో శిక్షణకు ఎంపిక అయినామా ? లేదా ? అంటూ నిర్వాహకులకు ఫోన్ చేస్తే కొన్ని సందర్భాల్లో స్విచ్ ఆఫ్, మరి కొన్ని సందర్భాల్లో వారు ఫోన్ ఎత్తడం లేదు.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని నూతన బస్టాండ్ సమీపానగల ఓ లాడ్జిలో సైన్యంలో శిక్షణ ఎంపిక కోసం విద్యార్థుల ఎత్తు, ఛాతి వెడల్పు, బరువుల వివరాలు వారు సేకరించినట్టు సమాచారం. గత గురు శుక్రవారాలలో దాదాపు 50 మంది విద్యార్థులను నిర్వాహకులు ఈ లాడ్జిలో దేహదారుడ్యు పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం.
గ్రామీణ ప్రాంత విద్యార్థులే లక్ష్యం!
ఇద్దరు, లేదా ముగ్గురు, సభ్యులు సారంగాపూర్, బీర్పూర్, ధర్మపురి,బుగ్గారం, మండల పరిధిలోని పాఠశాలలకు వెళుతూ. ప్రధానోపాధ్యాయుడి, పాఠశాల ఉపాధ్యాయులు అనుమతి లేకుండానే పదవ తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థుల తరగతి గదిలోకి వెళ్లి. సైన్యంలో ఎంపికకు శిక్షణ ఇస్తున్నట్టు, మీరు ఫలానా తేదీన జగిత్యాలకు రావాల్సిందిగా అక్కడ మీ ఎత్తు ఛాతి వెడల్పు బరువు తూకం వేస్తామని ఈ పరీక్షలో ఎంపికైతే సైన్యంలో శిక్షణ ఇప్పిస్తామంటూ విద్యార్థులకు ఆశలు కల్పించినట్లు సమాచారం. పరీక్షలకు ₹1000/- ( వెయ్యి రూపాయలు ఫీజు అంటూ వసూలు చేసినట్టు సమాచారం)
ప్రభుత్వ యంత్రాంగం జోక్యం చేసుకొని విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది.