స్వీపర్లు స్కావెంజర్లు లేకుండా పాఠశాల నిర్వహణ ఎలా ?
ఈనెల 6 నుండి హాత్ సే హాథ్ జోడో ప్రారంభం.
పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి !
J. Surender Kumar,
జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో పట్ట భద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఆయన మాటలలో…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మెరుగైన విద్యా అవకాశాలు లభిస్తాయని భావిస్తే, సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతొంది.
ఎనిమిదేళ్లు గడుస్తున్న కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య సామాన్యులకు అందుబాటులోకి రాలేదు.
కేజీ టు పీజీ పాఠశాల ఒక్కటి ప్రారంభించి రాష్ట్రమంతా ప్రారంభించినట్టు ప్రచారం చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుంది.
విద్యార్థుల భవిష్యత్తు కోసం సామాన్యులు ఆర్థిక భారం ఐనా తమ పిల్లల భవిష్యత్తు కోసం ప్రైవేట్ పాఠశాల చదివించేందుకు చెప్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించినా..
బోధన సిబ్బంది నియామకం చేపట్టలేదు. తరగతి గదులు ఏర్పాటు చేయలేదు.
ఒకే తరగతి గదిలో ఒకే ఉపాధ్యాయుడు తెలుగు, ఇంగ్లీష్ బోధిస్తుండడంతో విద్యార్థులు ఏ భాషలోనూ ప్రావీణ్యం సాధించలేకపోతున్నారు.
బోధన సిబ్బంది భర్తీ చేపట్టకుండా గతం లో బోధన సదుపాయాల కల్పన కోసం ఉన్న విద్యా వాలంటీర్ వ్యవస్థను తొలగించారు.
2022 23 సంవత్సరంలో 20,000 పోస్టులు భర్తీ చేస్తామన్న కేసీఆర్ నేటికీ భర్తీ ప్రక్రియ పూర్తి చేయలేదని విమర్శించారు.

ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు వచ్చి ఆరు నెలలు గడుస్తున్న ఉపాధ్యాయ భర్తీ చేపట్టకుండ సీఎం కెసిఆర్ భావి భారత పౌరుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు.
ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పన పేరిట మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించడాని స్వాగతిస్తున్నామన్నారు.
ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నిధులు రద్దుచేసి సుమారు రు.600 కోట్లు మన ఊరు మనబడి పథకానికి మళ్ళించారన్నారు.
మన ఊరు మనబడి పథకం కింద చేపట్టిన పనుల్లో 10% కూడా పూర్తి కాలేదన్నారు.
పనుల్లో జాప్యానికి అధికార యంత్రంగా బాధ్యత వహించాలన్నారు.
ప్రజల ప్రాథమిక హక్కులు విద్య, వైద్యం అందకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో స్వీపర్లు స్కావెంజర్లను తొలగించడంలో ఉద్దేశం ఏమిటని నిలదీశారు.
పాఠశాలలు స్కావెంజర్లు స్వీపర్లు లేకుండా నిర్వాహన సాధ్యమేనా అని విద్యాశాఖ మంత్రిని ప్రశ్నించారు.
ప్రభుత్వం ప్రకటనలకు వెచ్చిస్తున్న మొత్తాన్ని పాఠశాల నిర్వహణకు వెచ్చించాలని హితవు పలికారు.
ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకు పోకుండా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచించారు.
ఈనెల 6 నుండి హాథ్ సే హాథ్ జో డో..
హాథ్ సే హాథ్ జో కర పత్రాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆవిష్కరించారు అనంతరం డీసీసీ అద్యక్షుడు అడ్లురి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు తెలిపేందుకు ఈనెల 6 నుండి కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు.
2014 రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ చేపట్టిన పథకాలను ప్రజల వివరించాలన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కెసిఆర్ పాలన కేంద్రంలో నరేంద్ర మోడీ పాలనలో ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ గడపగడపకు కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్ళనున్నట్లు తెలిపారు.
గ్రామీణ ప్రాంతంలో నిరుపేదలకు ఉపాధి కల్పించేందుకు యూపీఏ పాలన కాలంలో అప్పటి చైర్పర్సన్ సోనియా గాంధీ ఉపాధి హామీ పథకం రూపొందించారని గుర్తు చేశారు.
నేడు ఎన్ డి ఏ ప్రభుత్వం ఉపాధి హామీ నిధులకు కోత పెట్టి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హాత్ సే హా థ్ జో డో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పిసిసి ఆర్గనైజింగ్ కార్యదర్శి బండ శంకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య, జగిత్యాల పట్టణ అధ్యక్షుడు కొత్తమోహన్, మనిషి ఫ్లోర్ లీడర్ కల్లపల్లి దుర్గయ్య, మైనార్టీ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మన్సూర్,
మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్ పుప్పాల అశోక్, రాధా కిషన్ మారు గంగా రెడ్డి, మహిపాల్, విజయ్, రాజిరెడ్డి, ధర్మపురి నియోజక వర్గ నాయకులు పాల్గొన్నారు.