జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్!
J. Surender Kumar,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లాలోని ఉపాధ్యాయుల బదిలీలు-2023 మరియు పదోన్నతులు చేపట్టుటకు షెడ్యులు జారీచేసిన సందర్భంగా జగిత్యాల జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష కార్యదర్శులతో సమన్వయ సమావేశం జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయములో శ్రీమతి దావ వసంత సురేష్, చైర్ పర్సన్, అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశములో సి.ఇ.ఓ. రామానుజాచార్యులు, డి.ఇ.ఓ జగన్ మోహన్ రెడ్డి మరియు ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు హాజరయ్యారు.
ఉపాధ్యాయుల బదిలీలు 2023 కమీటి చైర్ పర్సన్ శ్రీమతి దావా వసంత సురేష్ మాట్లాడుతూ..

ఉపాధ్యాయుల బదిలీలు 2023 మరియు పదోన్నతులను చేపట్టు క్రమములో ఉపాధ్యాయుల సీనియారిటీని ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి ఉపాధ్యాయులకు అన్యాయము కలగకుండా పారదర్శకత పాటించాలని డి.ఇ.ఓ జగన్ మోహన్ రెడ్డి ని కోరారు. ప్రత్యేక క్యాటగిరి మరియు స్పౌస్ కేసులలో నమోదు చేసిన దరఖాస్తు లను సంబందిత పత్రములను ప్రత్యేక శ్రద్ధతో పరిశీలించాలని డి.ఇ.ఓ. జగన్ మోహన్ రెడ్డికి కమీటి చైర్ పర్సన్ శ్రీమతి దావా వసంత సురేష్, చైర్ పర్సన్ సూచించారు