ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతుల ప్రక్రియకు సంఘాలు సహకరించాలి !

కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా!

J. Surender Kumar,

27 నుండి ప్రారంభమైన ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ సజావుగా జరిగేందుకు ఉపాధ్యాయ సంఘాలు సహకరించాలని, మన ఊరు మన బడి పనులు వేగవంతం చేయాలని వారు కోరారు.

ఉపాధ్యాయ MLC కూర రగోత్తము రెడ్డి ఆధ్వర్యంలో PRTU TS జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యాళ్ళ అమర్నాథ్ రెడ్డి, బోయినిపెల్లి ఆనంద్ రావు నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషను శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచం శాలువాతో సత్కరించి 2023 PRTU డైరీ అందజేశారు.


ఈ కార్యక్రమంలో జగిత్యాల రూరల్ పిఆర్టియు ప్రధాన కార్యదర్శి బొమ్మకంటి శ్రీనివాస్ పాల్గొన్నారు
.