ఉట్నూర్ ఐటీడీఏ ఆఫీస్‎పై ఆదివాసీల దాడి !

J. Surender Kumar,

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంపై  సోమవారం ఆదివాసీలు తుడుం దెబ్బ ఆధ్వర్యంలో దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆఫీస్ పై రాళ్లు రువ్వారు. ఆదివాసీల రాళ్ల దాడిలో కార్యాలయం ఎదుట పార్క్ చేసిన పలు ప్రభుత్వ వాహనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ నేపథ్యంలో తమ హక్కులను కాలరాస్తే ఊరుకోమని నిరసనకారులు హెచ్చరించారు.


చట్ట బద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.. ఇతర  కులాలను ఎస్టీ జాబితాలో చేర్చవద్దన్నారు.
అనంతరం గిరిజన యూనివర్సిటీని ఆదిలాబాద్ జిల్లాలోనే ఏర్పాటు చేయాలని  డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే తమకు ఆదివాసీ బంధు ఇవ్వాలని, షరతులు లేకుండా భూహక్కు పత్రాలు ఇవ్వాలని ఆదివాసీలు డిమాండ్ చేశారు.

ఇంచార్జ్ ఐ టి డి పి ఓ వరుణ్ రెడ్డి ఆదివాసులకు మూడు రోజుల్లో కూడా పట్టాలిస్తామంటూ తనను విశ్వసించండి అంటూ కోరడంతో ఆదివాసులు శాంతించారు. నేపథ్యంలో ఓట్లు ఉత్యుత్త పరిస్థితిలకు ఉంది భారీగా పోలీసులు సోమవారం రాత్రి నుంచి తరలి వెళ్లాయి.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.