వ్యవసాయానికి 24గంటలు నాణ్యమైన విద్యుత్తు ఇవ్వాలి !

జువ్వాడి కృష్ణారావు డిమాండ్!

J. Surender Kumar,

రాష్ట్రంలోని రైతాంగానికి వ్యవసాయానికి త్రి పేస్ కరెంట్ ప్రతిదినం 24 గంటల పాటు అందించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు జువ్వాడి కృష్ణారావు డిమాండ్ చేశారు. బుధవారం పత్రిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్య కాంక్షతో పార్టీ విస్తరణలో భాగంగా తెలంగాణ ప్రాంతంలో రైతాంగానికి 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్నామని ఇతర రాష్ట్రాల్లో ఉపన్యాసాలు ఇస్తున్నాడని కానీ వ్యవసాయానికి మూడు గంటలకు కూడా రాష్ట్రంలో కరెంటు ఇవ్వడం లేదని ఇచ్చిన కరెంటు కూడా రాత్రులు ఇస్తున్నారని దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అన్నారు.

రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కోరుట్ల నియోజకవర్గంలో రైతు అష్ట కష్టాలు పడుచున్నారని ఏ సమయంలో కరెంటు ఇస్తున్నారో ఎప్పుడు తీస్తున్నారు అర్థం కాకుండా రాత్రి పగలు వ్యవసాయ పంపు సెట్ల వద్ద రైతులు కాపలా కాస్తున్నారని కృష్ణారావు అన్నారు. ఇప్పటికైనా రైతాo గానికి 24గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించాలని కృష్ణారావు డిమాండ్ చేశారు.