పంచాక్షరి మంత్రంతో .. ప్రతి ధ్వనిస్తున్న క్షేత్రం!
భక్తజన ప్రవాహంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న క్షేత్రం!
J.SURENDER KUMAR,
దక్షిణ కాశి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని భక్తజన తాకిడితో శనివారం శివమయంగా మారిపోయింది. భక్తులు ఓం నమశ్శివాయ పంచాక్షరి మంత్ర నామస్మరణతో క్షేత్రంలోని పురవీధులు, వాడలు ప్రతిధ్వనిస్తున్నాయి.

రాష్ట్రం, ఇతర రాష్ట్రాల నుంచి, ప్రవాహంలో తరలివస్తున్న లక్షలాదిమంది భక్తజనం తాకిడికి క్షేత్రం ఉక్కిరిబిక్కిరి అవుతున్నది..

లింగోద్భవ పూజా కార్యక్రమం 12 గంటలకు ఆలయంలో వేద పండితులు వేదమంత్రాల తో ప్రారంభించారు. ఆదివారం తెల్లవారుజాము 4 గంటల వరకు కొనసాగుతుంది.

వేలాది మంది భక్తజనం రహదారులు, రోడ్ల పక్కన దీపాలు వెలిగించుకొని భక్తి పరవశంతో పూజలు చేస్తూ దీపాలు వెలిగించుకుంటూ జాగారం చేస్తున్నారు. శివదీక్ష పరులైన స్వాములు స్వామివారిని దర్శించుకోవడానికి గంటల తరబడి క్యూలైన్లలో

ఎదురుచూస్తున్నారు. లింగోద్భవం దర్శించుకోవడానికి వేలాదిమంది భక్తులు క్యూ లైన్ లో పడిగాపులు కాస్తున్నారు. వేలాది వాహనాలు చెరువు కట్టపై పార్కింగ్ లో నిలిపిన దృశ్యం కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ దృశ్యాన్ని తలపిస్తున్నది.

సంస్కృతి కార్యక్రమాలు భజనలతో భక్తులు జాగారం చేస్తున్నారు.






