ప్రారంభించిన కలెక్టర్ శ్రీమతి యాస్మిన్ బాషా!
J Surender Kumar,
హైదరాబాద్ కి చెందిన స్టేట్ T-LIFE ఆర్గనైజేషన్ సంస్థ ఆధ్వర్యంలో మహిళలు యువత యువకుల వ్యాపార అభివృద్ధి-ఆవిష్కరణలకు “అవకాశాలు సవాళ్లు” పేరిట జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్స్ లో ప్రత్యేక అవగాహన సదస్సును కలెక్టర్ యాస్మిన్ భాష ప్రారంభించారు.

శ్రీమతి యాస్మిన్ బాషాతో పాటుగా జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత, జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత, ఎల్ ఎం కొప్పుల ఛారిటబుల్ ట్రస్టు చైర్పర్సన్ శ్రీమతి కొప్పుల స్నేహలత ఈశ్వర్ , జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కుందారపు లక్ష్మినారాయణ, మెప్మా జిల్లా అధికారి శ్రీనివాస్ గౌడ్ మరియు టి-లైఫ్ ఆర్గనైజేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి తాటిపర్తి దీపిక రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి పొన్నాల శిరీష, పలు మహిళా సంఘాల సభ్యులు, మహిళలు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పొన్నాల గార్డెన్స్ ఆవరణలో మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులతో కూడిన ప్రదర్శనా స్టాల్స్ ను ఏర్పాటు చేయగా, వాటిని కలెక్టర్ శ్రీమతి యాస్మిన్ బాషా ప్రారంభించి, పరిశీలించారు.,

ఈ అవగాహనా సదస్సులో..జిల్లా కలెక్టర్ శ్రీమతి యాస్మిన్ బాషా మాట్లాడుతూ…మహిళా సంఘాలు, మహిళ ఎంటర్పేన్యూయర్ లు తయారు చేస్తున్న వివిధ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం,

ఉత్పత్తులకు బ్రాండింగ్, వివిధ సంస్థలతో అనుసంధానం, బిజినెస్ ప్లాన్ పై జిల్లా కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడానికి ముందుకు వచ్చిన టి-లైఫ్ సంస్థ ప్రతినిధులను ఈ సందర్భంగా కలెక్టర్ తో పాటుగా జడ్పీ చైర్పర్సన్, ఎల్ ఎం కొప్పుల ఛారిటబుల్ ట్రస్టు చైర్పర్సన్ లు అభినందించారు.

, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను స్వయం స్వశక్తి మహిళలు సద్వినియోగం చేసుకుని, ఆర్థిక స్వావలంబన దిశలో మరింతగా ఎదగాలని, నాణ్యతతో కూడిన వస్తువులను తయారు చేయాలని, జగిత్యాల జిల్లా కు మంచిపేరుతేవాలని కలెక్టర్ తో పాటు అతిథులు ఆకాంక్ష వ్యక్తం చేశారు.
