2024 జనవరిలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తుంది !

టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి !

J. SURENDER KUMAR,

జగిత్యాల జిల్లా లో రేవంత్ రెడ్డి  జోడో యాత్రలో భాగంగా ఆదివారం  కథలాపూర్ కలికోట సూరమ్మ ప్రాజెక్ట్, సందర్శించిన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి, 2024 జనవరి 1న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు.మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ తదితర కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ
రైతులను మోసం చేసిన పార్టీ టీఆరెస్.
కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులు ఇప్పటి వరకు పూర్తి చేయలేదు.
వైయస్ రాజశేఖరరెడ్డి ఎత్తిపోతల పథకం పెడితే కెసిఆర్ తిప్పి పోతల పథకం పెట్టిండు.
బుర్ర కథలు చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు బతుకుతున్నారు.

విజిటింగ్, విహారయాత్ర లో ఎమ్మెల్యే రమేష్ బాబు. ఉన్నారన్నారు
కెసిఆర్ ను మారిస్తే తప్ప మన జీవితాలు మారవు. కెసిఆర్ ఫామ్ హౌస్ ప్రక్కన మాత్రమే ప్రాజెక్టులు పూర్తి అవుతాయి.
జనవరి 1 2024 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాగానే పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తాం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

కొండగట్టు అంజన్న దర్శించుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి !


ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు
జీవన్ రెడ్డి కి అర్చకులు, అధికారులు. ఆలయ సాంప్రదాయ పద్ధతి స్వాగతం పలికారు.
ఆలయ అర్చకులు అధికారులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దంపతుల ను, శాలువలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.,