అదాని మోడీ అనుబంధాన్ని ప్రశ్నించినందుకే – రాహుల్ గాంధీ పై అనర్హత వేటు !

విలేకరుల సమావేశం లో పిసిసి కార్యదర్శి జగదీశ్వర్!

J.SURENDER KUMAR,

అదాని మోడీ అనుబంధంపై పార్లమెంటులో ప్రశ్నించినందుకే రాహుల్ గాంధీ పై వేటు వేయడాన్ని ప్రజాస్వామ్యవాధులు ఖండించాలని కార్యదర్శి జగదీశ్వర్ అన్నారు.
దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన కుటుంబానికి వారసుడైన రాహుల్ గాంధీని పార్లమెంటులో ప్రశ్నించకుండా అనర్హత వేటు వేశారనీ కేంద్ర ప్రభుత్వం పై ద్వజమెత్తారు.

కులాల, మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతున్న బిజెపి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ.. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ భారత జాతిని ఏకం చేసేందుకు రాహుల్ గాంధీ భారత్ జో డో యాత్ర చేపట్టారు.
మోడీ ప్రభుత్వం చట్టాలను తుంగలో తొక్కుతూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందన్నారు.
ఆర్థిక నేరగాళ్లు నీరవ్ మోడీ, లలిత్ మోడీలతో మోడీలకు ఉన్న సంబంధం ఏంటని ప్రశ్నించడం నేరమా కానీ జగదీశ్వర్ ప్రశ్నించారు
ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలు నడుం బిగించాలనీ పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో పిసిసి ఆర్గనైజింగ్ కార్యదర్శి బండ శంకర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లేపల్లి దుర్గయ్య, గాజుల రాజేందర్ పుప్పాల అశోక్ నక్క జీవన్, జగిత్యాల రూరల్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జున్ను రాజేందర్, కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సిరాజుద్దీన్ మన్సూర్, పిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా, చందా రాధా కిషన్, గుంటి జగదీశ్వర్ కమటాల శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండా మధు, లైశెట్టి విజయ్, మైనారిటీ సెల్ పట్టణ అధ్యక్షుడు నేహాల్ పాల్గొన్నారు.