అంగరంగ వైభవంగా జరిగిన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం!

పోటెత్తిన భక్తజనం!


దర్శించుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ !


J. Surender Kumar ,

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం. అంగరంగ వైభవంగా వైభవంగా జరిగింది. రథోత్సవం తిలకించడానికి తరలివచ్చిన భక్తజనంతో ధర్మపురి క్షేత్రం పోటెత్తింది. మంత్రి కొప్పుల ఈశ్వర్ రథోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.


ఆదివారం సాయంత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, వెంకటేశ్వర స్వామి, శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహాలు. మూడు రథములపై ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.

బలిహరణాల తర్వాత భక్తుల సందర్శనం అనంతరం వేలాది మంది భక్తజనం గోవింద నామస్మరణలు, హర హర మహాదేవ, అంటూ భక్తి పరవశంతో నినాదాలు చేస్తూ, స్వామివారి రథములను క్షేత్ర పురవీధుల గుండా బ్రహ్మ పుష్కరిణి ,ఇసుక స్తంభం, నంది విగ్రహం వరకు, ఊరేగించారు.

అనంతరం అర్చక స్వాములు స్వామివారి ఉత్సవమూర్తులను పవిత్ర గోదావరి నది లో చక్ర స్నానం , ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించి క్షేత్రంలో ఊరేగించారు. మధ్వాచారి వంశీయుల ఇంటి లో స్వామివార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి.

ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఆర్యవైశ్య సంఘం వారు మజ్జిగ ప్యాకెట్లు, దాత అయ్యోరి శ్రీనివాస్ పులిహోర ప్యాకెట్లను, భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు.

పోలీస్ యంత్రాంగం రోప్ పార్టీ పోలీసు బృందాలు, రథాలకు, రథాలకు మధ్య ఇద్దరు ఎస్సైలు, పోలీస్ బలగాలతొ. బందోబస్తు ఏర్పాటు చేసి తొక్కిస్తాలాట జరగకుండా భద్రత చర్యలు చేపట్టారు.

మంత్రికి స్వామివారి శేష వస్త్రం
రథోత్సవంలో పాల్గొన్న మంత్రి
రథోత్సవం