రెండు రోజుల ఆదాయం ₹ 19 లక్షలు..
J. Surender Kumar,
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గత రెండు రోజుల స్వామి వారి ఆదాయం ₹ 19, 35, 314/ వచ్చింది

మంగళవారం హోలీ, స్వామివారి తెప్పోత్సవం తిలకించడానికి తరలివచ్చిన భక్తజనంతో ధర్మపురి పోటెత్తింది. గంటల తరబడి భక్తులు క్యూ లైన్ లో నిలబడి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

కరీంనగర్ డైరీ వారు భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. స్థానిక రైస్ మిల్ అసోసియేషన్ వారు భక్తజనంకు స్థానిక బ్రాహ్మణ సంఘ భవనంలో రుచికరమైన నిరంతర ఉచిత అన్నదానం నిర్వహిస్తున్నారు.

ఆలయ అధికారులు, సిబ్బంది, అభివృద్ధి కమిటీ సభ్యులు. భక్తుల సౌకర్యాల కల్పన కోసం కృషి చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో సేద తీర్చే భక్తుల కోసం మినరల్ వాటర్ సౌకర్యంతో పాటు. వైద్య సిబ్బందిని, అందుబాటులో ఉంచారు.

నిరంతర సీసీటీవీ పర్యవేక్షణలో. భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు.. ఆలయ ప్రాంగణంలో శేషప్ప కళా వేదికపై. సంగీత, సాహిత్య, సంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పోలీసుల పికేటింగ్ తో పాటు. రద్దీని మైక్ ద్వారా ప్రకటిస్తూ తొక్కిసలాట జరగకుండా నియంత్రిస్తున్నారు .

స్థానిక మునిసిపల్ పారిశుద్ధ్య సిబ్బంది ఆలయ ప్రాంగణం, గోదావరి తీరం, పట్టణ వీధులను షిఫ్ట్ ల వారిగా రాత్రి, పగలు శుభ్రం చేస్తున్నారు. రాత్రివేళలో నిరంతర పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.
