J. Surender Kumar,
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంకురార్పణ పూజా కార్యక్రమంతో శుక్రవారం ప్రారంభమయ్యాయి.
ఆలయ వేద పండితులు , కార్యనిర్వహణాధికారి, అభివృద్ధి కమిటి సభ్యులు మేళా తాళాలతో చక్రపాణి వామన చార్య ఆచార్యుల, ఇంటికి వెళ్లి బ్రహ్మోత్సవాలు ప్రారంభించాల్సిందిగా ఆలయానికి ఆహ్వానించారు.

ఆచార్యులు రాకతో బ్రహ్మోత్సవాల కలశస్థాపన, పూజారి కార్యక్రమాల తర్వాత స్వామి వారలు, మంగళ వాయిద్యాలు మేళ తాళాలు వేదమంత్రాలతో ఊరేగింపుగా వరహ తీర్థం వద్ద కు చేరుకున్నారు. నూతనంగా నిర్మితమైన పుట్ట బంగారు మండప వేదిక ముందు పుట్ట బంగారం పూజా కార్యక్రమం నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం బ్రహ్మోత్సవాలలో మౌలిక సదుపాయాలు సహా, భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులను భాగస్వామ్యం చేశారు.

కమాన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు!

ఆధ్యాత్మికవాతావరణం ఉట్టిపడేలా వైభవోపేతంగా వేడుకలను నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
భక్తులకు రక్షణ సౌకర్యాల కల్పన కోసం అత్యంత ప్రాధాన్యత నిస్తూ స్వామి వారి దర్శనం భక్తులకు సులభం గా, వేగంగా జరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు.

భక్తులకు, కర్యవ్య నిర్వహణలో నిమగ్నమైన సిబ్బందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేందుకు, శాఖల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు సమస్యల సత్వర పరిష్కారానికి కమాండ్ కంట్రోల్ రూమ్ ను సైతం ఏర్పాటు చేశారు.

ఉత్సవాలను ఆద్యాంతం నిఘా నేత్రాలతో పరిశీలిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా చూసేందుకు పోలీస్ శాఖ నేతృత్వంలో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ కార్యాచరణను పోలీస్ శాఖ సిద్ధం చేసింది.
గోదావరి నదిలో, పట్టణంలో క్లీనింగ్ !

బ్రహ్మోత్సవాల కోసం తరలివచ్చి వేలాదిమంది భక్తజనం పవిత్ర గోదావరి స్నానాచరిస్తారు. అంటు వ్యాధులు ప్రజలకు ఉన్న గోదావరి నదిలో చెత్తాచెదారం లేకుండా నిరంతరం స్నానాల ఘాట్ ల వద్ద యంత్రాంగం శుభ్రపరుస్తుంది.

పారిశుద్ధ్య సిబ్బంది షిఫ్టుల వారీగా పట్టణలోని వీధులు, గోదావరి నది తీరం, బస్టాండ్ ప్రాంతాలను చెత్తాచెదారం లేకుండా శుభ్రపరుస్తున్నారు.

శనివారం సాయంత్రం స్వామివారి కళ్యాణం !
శనివారం గోధూళి సుముహూర్తాన లక్ష్మీనరసింహస్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. ఇప్పటికే ఆలయాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
