J. Surender Kumar.
జగిత్యాల జిల్లా కేంద్రంలో అపార్ట్మెంట్ నిర్మాణ సంస్థ స్రవంతి కన్స్ట్రక్షన్ కు వినియోగదారుల ఫోరం మొట్టికాయ వేసింది. వినియోగదారుడికి తక్షణం రెండు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడమే గాక,₹ 30,000/- నష్టపరిహారం తో పాటు,. ఖర్చుల నిమిత్తం. మరో ₹ 5,000/- చెల్లించాలని కన్స్ట్రక్షన్ కంపెనీకి వినియోగదారుల ఫోరం ఆదేశిస్తూ తీర్పు ఉత్తర్వులు జారీ చేసింది.
వివరాలు ఇలా ఉన్నాయి..
జగిత్యాల పట్టణం కు చెందిన దాసరి మహేందర్, పట్టణంలోని లక్ష్మీ రెసిడెన్స్ అపార్ట్మెంట్ లో 503,504. రెండు ప్లాట్లను ₹ 50 లక్షల కు కొనుగోలు చేశారు. అగ్రిమెంట్ ప్రకారం ₹ 49 లక్షలు నిర్మాణ సంస్థకు చెల్లించారు. మరో లక్ష రూపాయల చెక్కును వారికి చెల్లించగా. అట్టి డబ్బు తీసుకోవడానికి నిరాకరిస్తూ, కొనుగోలు చేసిన రెండు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బందులకు గురి చేశారు.
తనకు జరిగిన అన్యాయంపై వినియోగదారుడు దాసరి మహేందర్, ప్రముఖ న్యాయవాది మేట్ట మహేందర్ ద్వారా. వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు.

సుప్రీంకోర్టు అప్పిల్ సంఖ్య, 62-39/2019 అనుసరించి.. వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు స్వరూపారాణి, సభ్యులు శ్రీలత, నరసింహారావు లు జారీ చేసిన తీర్పు ఉత్తర్వులలో లలో రెండు ప్లాట్లను తక్షణం రిజిస్ట్రేషన్ చేయాలని, వినియోగదారుడికి నష్టపరిహారంగా ₹30, 000/- తో పాటు, ఖర్చుల నిమిత్తం మరో₹,5000/- చెల్లించాలి అంటూ, పేర్కొన్నారు.