SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామ ఆరోగ్య కేంద్రంలో బుధవారం ప్రారంభించిన ఆరోగ్య మహిళా పథకం కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది.
వివరాలు ఇలా ఉన్నాయి.
మండలం నేరెళ్ల గ్రామ ప్రభుత్వం ఆరోగ్య కేంద్రంలో ప్రోటోకాల్ నిబంధనల మేరకు మండల పరిషత్ అధ్యక్షులు ప్రారంభించాల్సి ఉండగా డీసీఎంఎస్ చైర్మన్ ఎలా ప్రారంభిస్తారు అంటూ ? బుగ్గారం జడ్పిటిసి సభ్యుడు బాదినేని రాజేందర్, జిల్లా వైద్యాధికారిని సబికుల సమక్షంలోనే ఫోన్ ద్వారా ప్రశ్నించారు.

బుగ్గారం, ధర్మపురి మండలంకు నేరెళ్ల గ్రామ ఆరోగ్యం కేంద్రంగా ఉమ్మడిగా కొనసాగుతుంది. ఆరోగ్య మహిళా పథకం ను ఇద్దరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుల లో ఎవరో ఒకరు ప్రారంభించాల్సి ఉందని, ప్రోటోకాల్ నిబంధనలు తుంగలో తొక్కి డీసీఎంఎస్ చైర్మన్ తో ప్రారంభించమని మీరు ఎలా లేఖ లో పేర్కొన్నారు అంటూ DM &HO ను జడ్పిటిసి సభ్యుడు ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేస్తూ నిలదీశారు. మంత్రి అనుమతితో ప్రారంభోత్సవ ఉత్తర్వులు జారీ చేసినట్టు జిల్లా వైద్యాధికారి జెడ్పిటిసి సభ్యుడికి వివరించారు.
ఈ దశలో పలువురు ప్రజా ప్రతినిధులు కార్యక్రమానికి వచ్చిన ఉప జిల్లా వైద్యాధికారి నీ ప్రశ్నించడంతో ఆయన మౌనం వహించారు. ఈ దశలో బుగ్గారం జడ్పిటిసి సభ్యుడు , డీసీఎంఎస్ చైర్మన్ ప్రశ్నించారు.. పథకం ప్రారంభించాల్సిందిగా నాకు ఆహ్వాన ఉత్తర్వులు ఇవ్వడంతో ప్రారంభించాను అన్నారు.
ప్రోటోకాల్ వివాదం ధర్మపురి, బుగ్గారం మండలలోనీ ప్రజా ప్రతినిధులు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.