ఎస్పీ ఎగ్గడి భాస్కర్ !
J. Surender Kumar,
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు లో చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే మహోత్సవలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని జగిత్యాల జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ అధికారులను ఆదేశించారు.
చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఏలాంటి నేరాలకు తావులేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.ఆలయ పరిసరాల్లో, మాలవిరమణ, క్యూలైన్లలో, వాహనాల రాకపోకలు మొదలైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయవలసిన భద్రత ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు.

అనంతరం కొండగట్టుపైన ఏర్పాటు చేసిన పోలీస్ ఔట్ పోస్ట్ తనిఖీ చేశారు. పోలీస్ అవుట్ పోస్టుకు అనుసంధానం చేసిన సిసి కెమెరాలు యొక్క పనితీరును పరిశీలించారు.
ఎస్పీ వెంట డిఎస్పి ప్రకాష్, మల్యాల సి.ఐ రమణమూర్తి, ఉన్నారు.