J.SURENDER KUMAR,
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటూ జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు.
ఆమె మాటల్లో ..
మహిళ అనే గౌరవం లేకుండా నువ్వు మాట్లాడిన తీరు యావత్తు మహిళ లోకాన్ని అవమానించేలా ఉంది. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలోనే మరో మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మహిళలపై ఆయనకి బిజెపి పార్టీకి ఉన్న గౌరవం మర్యాద ఎంటో తెలియజేస్తున్నది. కవితక్కను అవమానించిన బండి సంజయ్ ని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జగిత్యాల ఎస్పీ శనివారం ఫిర్యాదు చేశారు.
మహిళల హక్కుల కోసం పోరాడుతున్న కవితక్క గారిపై బిజెపి కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నది. అవగాహన లేని బీజేపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారు.

బిజెపి అధినాయకత్వం కుట్ర పూరితంగా కవితక్క పై కేసు పెట్టినా పారిపోకుండా ధైర్యంగా విచారణ ఎదుర్కొంటున్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్రలు చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన బిజెపి బ్రోకర్లు, వారి వెనకాల ఉన్న బీఎల్ సంతోష్ విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. కానీ కవితక్క మాత్రం ఏ తప్పు చేయకున్నా.. ధీరవనితలు రాణి రుద్రమ, ఝాన్సీ లక్ష్మీబాయిలా ధైర్యసాహసాలతో పోరాడుతున్నారు. అలాంటి వీర వనిత గురించి నీచంగా మాట్లాడిన బండి సంజయ్ ని వెంటనే అరెస్ట్ చేయాలి.వెంట జెడ్పీటీసీలు,ఎంపీపీలు, AMC ఛైర్మెన్ తదితరులు ఉన్నారు.