ఈ నెల 3 చివరి గడువు !
జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష!
J. Surender Kumar,
జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్ రూం ఇండ్లను పొందడానికి అర్హులైన వారు తమ ధృవీకరణ పత్రాలను ఈ నెల 3 వ తేదీన జగిత్యాల పట్టణంలోనీ నటరాజ్ థియేటర్ ప్రక్కన గల RK డిజి స్కూల్ నందు తమ వార్డు అధికారి లేదా వార్డు ఆర్పీ కి అందజేయాలని
జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తెలిపారు.
ఈ మేరకు గురువారం సాయంత్రం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల పరిధిలోని
డబుల్ బెడ్ రూం ఇండ్లను పొందడానికి అర్హులైన వారు ఆధార్ కార్డు జిరాక్స్( కుటుంబ సభ్యులందరి), ఓటర్ గుర్తింపు కార్డు జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్ ,కుల ధ్రువీకరణ పత్రం జిరాక్స్ ,ఆదాయం ధ్రువీకరణ పత్రం జిరాక్స్ , బ్యాంక్ పాస్ బుక్ ( తెలంగాణ గ్రామీణ బ్యాంకు తప్ప ) , పాస్పోర్ట్ సైజు ఫోటో ను
జగిత్యాల పట్టణంలోనీ నటరాజ్ థియేటర్ ప్రక్కన గల RK డిజి స్కూల్ నందు తమ వార్డు కౌంటర్ లోని వార్డు అధికారి లేదా వార్డు ఆర్పీ కి అందజేయాలన్నారు.
ఒక వేళ కుల ధ్రువీకరణ , ఆదాయం ధ్రువీకరణ పత్రం లేని వారు మీ సేవలో దరఖాస్తు చేసుకొని వాటి యొక్క మీసేవ జిరాక్స్ ను తమ వార్డు అధికారికి లేదా ఆర్పికి ఇవ్వాలన్నారు.
ఈ నెల 3 వ తేదీన ఉదయం 09.00 గంటల నుండి సాయంత్రం 05.00 గంటల వరకు ధృవీకరణ పత్రాలను స్వీకరిస్తానని జిల్లా కలెక్టర్ చెప్పారు.
ధృవీకరణ పత్రాల సమర్పణ కు నేడు ( ఈ నెల 3 వ తేదీ) తుది గడువు అని
ఈ అవకాశాన్ని అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు .